iDreamPost
iDreamPost
అసలు ఏపీలో ఏం జరుగుతోంది? అసలు హిందూ ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఏ ఆకతాయి పనో కాదని తేలిపోయింది. ఎందుకంటే ఎవరో కావాలని ఓ ప్రణాళిక ప్రకారం విగ్రహాలు ధ్వసం చేస్తున్నారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఇవేవీ పట్టించుకోకుండా.. ఏదోలా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రతిపక్షాలు తీవ్రంగా యత్నిస్తున్నాయి..రాజకీయ ధ్వంస రచన చేస్తున్నాయి.. ఇరు వర్గాల మధ్య అగ్గిరాజేసేందుకు యత్నిస్తున్నాయి. అందుకు…రాముడి విగ్రహంపై దాడి ఉద్దేశపూర్వకంగానే జరిగింది..అని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం.
రామతీర్థం ఘటనపై ఏపీ సర్కారు సీఐడీ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ విజయనగరం జిల్లా రామతీర్థంలో విగ్రహం ధ్వంసం అయిన ప్రాంతాన్ని పరిశీలించారు. రాముడి విగ్రహంపై దాడి ఉద్దేశపూర్వకంగానే జరిగిందని అభిప్రాయపడ్డారు. సంఘటన స్థలంలో హేక్సా బ్లేడ్ లభ్యమైందని వెల్లడించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు, సమాజంలో భిన్న వర్గాల మధ్య చిచ్చుపెట్టేందుకు ఈ ఘటనకు పాల్పడి ఉంటారని సునీల్ కుమార్ తెలిపారు. అక్కడున్న నగలు, ఇతర విలువైన వస్తువులు భద్రంగానే ఉన్నాయని వివరించారు. జరిగిన ఘటన చూస్తుంటే ఆకతాయిల పనిలా అనిపించడంలేదని, పక్కా ప్రణాళికతోనే జరిగినట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. దర్యాప్తులో ఎవరు చేశారు, ఎందుకు చేశారన్నది మరింత స్పష్టంగా తేలుతుందని, ఇప్పుడు ఇంతకుమించి చెప్పలేమని అన్నారు.
మరోవైపు.. రామతీర్థం ఘటనలో విచారణ అధికారి సునీల్ కుమార్ ఓ క్రైస్తవుడు, అందుకే న్యాయం జరగదంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు అప్పుడే మతం పల్లివి అందుకున్నారు. ఏపీ సీఎం జగన్, హోంమంత్రి, డీజీపీ కూడా క్రైస్తవ మతస్తులేనని అన్నారు. ఇక, సునీల్ కుమార్ నిబంధనలను పట్టించుకోడని, ఆయనను గతంలో హైకోర్టు కూడా ఇదే అంశంలో మందలించిందని వివరించారు. ప్రభుత్వం ఎలా చెబితే అలా నడుచుకునే వ్యక్తి సునీల్ కుమార్ అని విమర్శించారు. అంతేకుండా గతంలో రంగనాయకమ్మపై కేసులు పెట్టడంలోనూ, తన స్నేహితుడు కిశోర్ చావుకు కూడా ఈ సునీలే కారకుడు అని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. అంటే అధికారులకు సైతం మతం అంటగట్టి, ఏదోలా రామతీర్థం ఘటనను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు యత్నిస్తున్నడని రఘురామ కృష్ణం రాజు వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి..ఏ విచారణ అయినా ప్రతిపక్షాలకు అనకూలంగా ఉండాలి తప్ప…ప్రజలకు న్యాయంజరిగేలా కాదన్నది ఆయన చేస్తున్న వ్యాఖ్యల ద్వారా అర్ధం అవుతోంది. అదే విషయాన్ని సీఎం జగన్ సైతం నొక్కి వక్కానించారు.
స్పందన కార్యక్రమంపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన సందర్భంగా సీఎం జగన్ ఆలయాలపై దాడుల ఘటనల పట్ల తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో రాజకీయ గెరిల్లా యుద్ధం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ దురుద్దేశాలతో అర్ధరాత్రి ఆలయాలపై దాడులు చేస్తున్నారని, ఉద్దేశపూర్వకంగా దాడిచేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని అప్రదిష్ఠకు గురిచేయాలన్నదే వారి లక్ష్యమని, పోలీసులు పరిస్థితులను జాగ్రత్తగా అంచనా వేయాలని తెలిపారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారిపై కఠినంగా వ్యవహరించాలని, రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తే గుణపాఠం చెప్పాలని సీఎం జగన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఘటన తీరు అలానే ఉంది.
రాజకీయ లబ్ధి కోసం దేవుళ్లను కూడా రాజకీయాల్లోకి లాగుతున్న తీరు ఏపీలో జరుగుతున్న ఘటనలు అద్దం పడుతున్నాయి. ఎందుకంటే దేవుడి విగ్రహాలను ధ్వంసం చేయడం వల్ల ఎవరికి లాభం అన్న అంశాన్ని గమనించాల్సి అవసరం ఉంది. ఎందుకంటే హిందువుల మనో భావాలను దెబ్బతీస్తే ప్రభుత్వానికి చెడ్డు పేరు వస్తుంది తప్ప..మంచిపేరు రాదు. పోనీ వర్గం ఆలయాల ధ్వంసాన్ని ప్రోత్సహిస్తే..ప్రభుత్వం అబాసు పాలు అవుతుంది తప్ప..ప్రయోజనం ఉండదని సీఎంకు తెలియదా? ఆమాత్రం విచక్షణ లేకుండా ప్రతిపక్షాలు ముఖ్యంగా టీడీపీ జగన్ ను టార్గెట్ చేస్తోంది,. అంటే ఎవరు చేశారు?
ప్రజలకు ఎలా న్యాయం చేయాలి అనే ఆలోచన కన్నా టీడీపీ అధినేతకు పార్టీని బతికించుకోవడమే మిన్నగా కనిపిస్తోందంటున్నారు పరీశీలకులు.ఎందుకంటే ఏపీలో జరుగుతున్నదాడులు కేవలం ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసేందుకే ఓ ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయి..వివరాల్లోకి వెళితే.. నాడు-నేడు కార్యక్రమానికి ప్రజా స్పందన వస్తున్న సమయంలో.. 2019లో దుర్గగుడి ధ్వంసం అనే ప్రచారం జరిగింది. వెండి సింహాలను మాయం చేశారని ప్రతిపక్షం ఆరోపించింది. దిశ పోలీస్ స్టేషన్లకు వస్తున్న మంచి పేరు వస్తున్న తరుణంలో కొన్ని గుడులను ధ్వంసం జరిగింది.
అలాగే రైతు జలసిరి కార్యక్రమాన్ని మొదలు పెట్టినప్పుడు జిల్లాలోని ఓ ఆలయంలో విగ్రహం ధ్వంసమైంది. విద్యా దీవెన కార్యక్రమం ప్రారంభానికి మూడు రోజుల ముందు నుంచే కుట్రలకు తెరలేచింది. కర్నూలులో లక్ష్మీనారాయణస్వామి ఆలయం ఘటన చోటుచేసుకుంది. బీసీల కోసం చర్యలు చేపట్టినప్పుడు వీరభద్రస్వామి ఆలయాన్ని ధ్వంసం అయింది. ఇంటి పట్టాలు ఇస్తున్నప్పుడు తిరుమల ఆలయ లైటింగ్ లో ఏసుక్రీస్తు శిలువ అని ప్రచారం జరిగింది. విజయనగరంలో ఇంటి పట్టాలు ఇస్తున్నప్పుడు రామతీర్థంలో విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
ఇలా ఏపీలో జరుగుతున్న ధ్వంస రచన ప్రభుత్వం ప్రజలకోసం ఏదో ఒక మంచి చేస్తున్న సమయంలోనే జరుగిందన్నది ఇక్కడ నిర్వివాదాశం.. అంటే ఓ మంచి పనికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ..అదేసంయంలో మెజారిటీ ప్రజల మనోభావాలతో ఆడుకుంటుందనుకోవడం మూర్ఖత్వమే..కాని ప్రతిపక్షాలు జగన్ క్రిస్టియన్ కాబట్టి హిందూ దేవుళ్ల విగ్రహాలను ప్రోత్సహిస్తున్నాడని ప్రతిపక్షాలు ఆరోపించడం నిజంగా మూర్ఖత్వం కాక మరేమవుతోందినేది ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.. సీఎం జగన్ చెప్పినట్లు ఏపీలో జరుగుతుంది రాజకీయ గెరిల్లా యుద్దం..ప్రజలారా తస్మాత్ జాగ్రత్త !