iDreamPost
android-app
ios-app

బార్ అసోసియేషన్ నిర్ణయం ఏకపక్షం – ఢిల్లీ లాయర్ల ప్రకటన

బార్ అసోసియేషన్ నిర్ణయం ఏకపక్షం – ఢిల్లీ  లాయర్ల ప్రకటన

హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి కి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ బార్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీలోని, హైకోర్టు, సుప్రీం కోర్ట్ లలో పని చేస్తున్న తెలుగు న్యాయవాదులు ఖండించారు. ఢిల్లీ బార్ ఎసోసియేషన్ తీసుకున్న నిర్ణయం ఏకపక్షమని తెలుగు లాయర్లు ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కి వ్యతిరేకంగా తీర్మానం చేయటం తప్పు . అసలు వాళ్ళు ఈ విషయం చర్చించేందుకు సర్వసభ్య సమావేశం కూడా పెట్టలేదు . ఈ విషయంలో ఢిల్లీ బార్ అసోసియేషన్ పూర్తి ఏకపక్షంగా వ్యవహరించింది. ఇది మాత్రం శాసనవ్యవస్థకి న్యాయవ్యవస్థకి మధ్య పోరాటం కానేకాదు . కోర్టుల వ్యవహార శైలిమీద ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సవంత్సరం కాలంగా ఓపికగా ఎదురు చూశారు. తనకున్న ఇంటెలిజెన్స్ రిపోర్టులు ఆధారంగా చీఫ్ జస్టిస్ కి పూర్తి ఆధారాలతో ఉత్తరం రాసారు. దానిని బహిరంగం చేయటంలో కూడా ఎలాంటి తప్పులేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలకి తెలియకుండా దాచిపెట్టమని రాజ్యాంగంలో ఎక్కడా లేదు . న్యాయవాద సంఘాలు ప్రజలకి మద్దతుగా ఉండాలి అంతేకానీ బెంచులకి మద్దతుగా తీర్మానాలు చేయటం విచిత్రంగా ఉంది. వాళ్ళు చేస్తున్న తీర్మానాలకు ఎలాంటి విలువ కూడా లేదు . రెండు రాష్ట్రాలలో ఉన్న తెలుగు ప్రజలే కాదు ఇది 130 కోట్ల మంది దేశ ప్రజల వ్యవహారం , అవినీతి ఎక్కడున్నా కప్పిపుచ్చకూడదు .వ్యవస్థలో మార్పులు కోసం పోరాడుతున్న సీఎం జగనమోహనరెడ్డి గారికి అందరం అండగా ఉండాలి అని తెలుగు లాయర్లు స్పష్టం చేశారు.