iDreamPost
android-app
ios-app

బాక్సింగ్‌ డే టెస్టు – పోరాడుతున్న ఆసీస్

బాక్సింగ్‌ డే టెస్టు – పోరాడుతున్న ఆసీస్

బాక్సింగ్‌ డే టెస్టు తొలి ఇన్సింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌట్‌ అయిన ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో పోరాడుతుంది. టీ విరామ సమయానికి ఆసీస్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 65 పరుగులు సాధించింది. స్టీవ్ స్మిత్ 6, మాథ్యూవేడ్‌ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్,అశ్విన్ చెరొక వికెట్ సాధించారు.

సోమవారం ఉదయం 277/5 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ తొలి సెషన్‌లో మరో 49 పరుగులు జోడించి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్‌ 3, లైయన్‌ 3, కమిన్స్‌ 2, హేజిల్‌వుడ్‌ 1 వికెట్లు తీసారు. రవీంద్ర జడేజా అర్ధ సెంచరీ సాధించాడు.

భోజన విరామం తర్వాత 131 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఉమేశ్‌ యాదవ్‌ మూడో ఓవర్లోనే షాకిచ్చాడు. ఓపెనర్ జో బర్న్స్ ను వికెట్ సాధించి భారత జట్టును సంబరాల్లో ముంచాడు. జాగ్రత్తగా ఆడుతున్న మార్నస్‌ లబుషేన్‌(28; 49 బంతుల్లో 1×5)ను రవిచంద్రన్‌ అశ్విన్‌ బోల్తా కొట్టించడంతో 42 పరుగుల వద్ద ఆసీస్ రెండో వికెట్‌ కోల్పోయింది. టీ విరామ సమయానికి మరో వికెట్ పడకుండా మాథ్యూవేడ్‌, స్టీవ్ స్మిత్ జాగ్రత్తగా ఆడుతున్నారు.