iDreamPost
iDreamPost
సీయం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఏ పని మొదలు పెట్టినా టీడీపీ నాయకులు ఎవరో ఒకరు వెంటనే ప్రెస్‌మీట్ పెట్టి విమర్శలు గుప్పించేస్తుంటారు. ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ కేలెండర్‌పై కూడా మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు యథాప్రకారం తన విమర్శల ‘డ్యూటీ’నీ చేసేసారు. ప్రెస్‌మీట్ పెట్టి కోటి ఉద్యోగాలు పొగోట్టారంటూ కొసమెరుపు కూడా ఇచ్చేసారు. పనిలో పనిగా ప్రభుత్వం చెబుతున్న లెక్కలను గారడీలుగా ప్రకటించేసారు. పదిహేను రోజుల క్రితం అలా చెప్పారు.. ఇప్పుడు ఇలా చెబుతున్నారంటూ ‘ఈకలు’ పీకే పనికూడా ప్రయత్నించేసారు.
ఆయన సైడ్ నుంచి చెప్పుకున్నదంతా బాగానే ఉంది గానీ.. ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చానని బహిరంగంగా ప్రకటించినవి ఇచ్చినట్టుగా ఒప్పుకుంటున్నారా? లేదా? అన్నదానిపై మాత్రం సూటిగా యనమల సమాధానం చెప్పలేదు ఆ మీడియా సమావేశంలో. విమర్శించడానికి ఏమీ దొరక్క కోవిడ్ సమయంలో తాత్కాలికంగా తీసుకున్న వారిని కూడా ఉద్యోగులుగా చూపించేసారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసేసారు. కాకపోతే యనమలకు అర్ధం కానిది.. ప్రజలకు అర్ధం అవుతున్న వాస్తవం మరోటుందన్నది మాత్రం యనమల మర్చిపోయారు.
పక్కాగా ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, తాత్కాలికం అంటూ కేటగిరీల వారీగా బహిరంగంగానే ప్రకటించినప్పటికీ ఈ ఈకలు పీకే కార్యక్రమాన్ని కొనసాగిస్తుండడం పట్ల ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి.
సరిగ్గా ఇటువంటప్పుడే మీ హయాంలో ఏం చేసారేంటి? అనడగాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఉద్యోగమూ లేదు.. నిరుద్యోగ భృతీ లేదు కదా.. వాటిని గురించి ఒప్పుకున్న తరువాత ఎదుటి వారి మీద విమర్శలు చేస్తే ప్రజల నుంచి కనీస స్పందన కలిగి ఉండేదని విమర్శకులు సూచిస్తున్నారు. ప్రజలు ఎందుకు తిరస్కరించారో? ఇంకా టీడీపీ అధినేత చంద్రబాబుకే అర్ధం కాలేదాయె.. ఆయన అనుచరులుగా యనమల తదితర వందమాగధులకు అర్ధమవుతుందనుకోవడం ఇసుక నుంచి నూనె తీయడమే అవుతుంది. అంచేతనే యనమల ప్రెస్‌మీట్ ప్రసారం అయిన వెంటనే యనమల డ్యూటీ పూర్తయిపోయింది.. అని ప్రజలు అనుకుంటున్నారు.
Also Read : అచ్చెం నాయుడు తెలిసే మాట్లాడుతున్నారా..?