రాజకీయాల్లో సద్విమర్శలు ఎంతో అవసరం. ప్రభుత్వాలు ప్రజాసంక్షేమం కోసం పని చేయని సమయంలో ప్రతిపక్షాలు సద్విమర్శలు చేస్తూ తమ వంతు ప్రాతను పోషించాలి. అప్పుడు ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రజల విశ్వాసాన్ని పొందుతాయి. మెజారిటీ ప్రజల మెప్పు పొందితే అధికారం కూడా దక్కుతుంది. సద్విమర్శలు కాకుండా.. పనిగట్టుకుని బురదజల్లేలా, వాస్తవాలకు విరుద్ధంగా విమర్శలు చేయడం వల్ల ప్రతిపక్ష పార్టీలు విశ్వసనీయతను కోల్పోక తప్పదు. ప్రజలను నమ్మించేందుకు అసత్యాలు ప్రచారం చేస్తే.. చివరకు నష్టమే తప్పా లాభం ఉండదు. ఈ విషయం తెలిసినా.. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు నిత్యం ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. పాతకాలపు రాజకీయాలకు కాలం చెల్లినా.. ప్రస్తుత కాలానికి అనుగుణంగా మారలేని యనమల పాత పంథాలోనే వెళుతున్నారు.
రెచ్చగొడితే రెచ్చిపోయే రోజులా..?
వైసీపీ ప్రభుత్వం మూడు రోజుల క్రితం వివిధ విభాగాల్లో 10,143 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఉద్యోగాల భర్తీపై మోసం చేసినందుకు వైఎస్ జగన్‌కు నిరుద్యోగులు, విద్యార్థులు గుణపాఠం చెప్పాలని యనమల పిలుపునిస్తున్నారు. జగన్ చెప్పిన అబద్ధాల వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ యువత ఉద్యోగాలు లేక తీవ్రంగా నష్టపోతున్నారని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. అయితేlగ్రామ, వార్డు సచివాలయాల ద్వారా జగన్ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో 1,21,518 ఉద్యోగాలు కల్పించిందన్న విషయం యనమలకు తెలియనట్లుంది. 1,21,518 ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ యువతకే 85 శాతం ఉద్యోగాలు దక్కాయి. అంటే మొత్తం ఉద్యోగాలలో 1,03,290 ఉద్యోగాలు వారికి లభించాయి. భారత రైల్వే కూడా ఒకే సారి భర్తీ చేయలేనన్ని ఉద్యోగాలను సీఎం జగన్ ఒకేసారి రాష్ట్ర యువతకు కల్పించారు.
నాడు అడగనేలేదు ఎందుకు..?
కేంద్రంలో అధికారంలో రావాలనుకునే పార్టీకి మన మద్ధతు అవసరం ఉన్నప్పుడు ప్రత్యేక హోదా తప్పక వస్తుందని సీఎం జగన్ ఎన్నికల సమయంలో చెప్పారు. కానీ బీజేపీకి మళ్లీ మంచి మెజారిటీ వచ్చింది. బీజేపీకి పూర్తి మెజారిటీ రావడం మన దురదృష్టమని, అయినా ప్రత్యేక హోదా ఇచ్చే వరకూ అడుగూనే ఉంటానని వైఎస్ జగన్ చెప్పారు. సమయం వచ్చినప్పుడల్లా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసే సమయంలోనూ హోదా ప్రముఖ్యతను గుర్తు చేసిన జగన్.. ఎప్పటికైనా ప్రత్యేక హోదా వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మాటలను వక్రీకరించిన యనమల.. బీజేపీకి కేంద్రంలో పూర్తి మెజారిటీ లేకుంటేనే ప్రత్యేక హోదా అడగగలమని జగన్ అన్నట్లుగా యనమల చిత్రీకరిస్తున్నారు. గట్టిగా పోరాడితే సాధ్యమయ్యే ప్రత్యేక హోదా అంశాన్ని తన స్వప్రయోజనాల కోసం తాకట్లు పెట్టారంటూ విమర్శిస్తున్న యనమల.. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీతో అధికారం పంచుకున్న సమయంలో ప్రత్యేక హోదా ఇవ్వాలని కనీసం మాట మాత్రమైనా అడగకుండా.. ప్రత్యేక ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారో యనమల చెప్పగలరా..? ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేయడం, ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టే.. ప్రజలు దూరం పెట్టారని యనమల ఎప్పటికి గుర్తిస్తారో..?
Also Read : 2019 ఎన్నికలను బాబు సీరియస్‌గా తీసుకోలేదా..?