Idream media
Idream media
టిడిపి నేతల బరితెగింపు, దందాలు, కుంభకోణాలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. గత ప్రభుత్వ హయంలో రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి నేతలు ప్రజా సంపదను దోచుకున్నారు. పోలవరం నుంచి రాజధాని, ఈఎస్ఐ కుంభకోణాలు మొదలుకొని చిన్న చితక సిసి రోడ్లు, మట్టి రోడ్లు నిర్మాణంలో అవినీతి వరకు దొరికింది దొరికినట్లు బుక్కేశారు. రాష్ట్ర స్థాయి నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి జెడ్పీటిసీలు, ఎంపిటిసిలు, గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్ వరకు అందరు చిన్నా చితక నేతలు కూడా దొరికింది దొరికినట్లు మేసేశారు. నాటి ఆగడాలు, అకృత్యాలు, అవినీతి బయట పడుతున్నాయి.
తాజాగా చిత్తూరు జిల్లా కుప్పంలో టిడిపికి చెందిన మైనింగ్ మాఫియా బరి తెగించింది. అనుమతులు ఉండవు.. నిబంధనలు పాటించరు.. చేసే దంతా దందానే.. అడ్డు చెప్పే వారి మీద దాడులు.. ఇది టిడిపి అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో పసుపు నేతల బరితెగింపు.. అక్రమంగా మైనింగ్ నిర్వహించడమే కాకుండా పేదలకు మంజూరు చేసిన ఇండ్ల స్థలాలను సైతం దర్జాగా ఆక్రమించి, అడ్డు వస్తున్న వారిపై దాడులకు పాల్పడుతున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అండతో రెచ్చిపోయిన పసుపు నేతలు ఇప్పుడు కూడా బరి తెగింపుకు పాల్పడుతున్నారు. శాంతిపురం మండలంలో టిడిపికి చెందిన నేత మైనింగ్ మాఫియా అవతారం ఎత్తారు. ముళ్ళూరు కృష్ణాపురంలో టిడిపికి చెందిన జయరామి రెడ్డి చాలా సంవత్సరాలుగా మైనింగ్ నిర్వహిస్తున్నారు.
తనకు గ్రామంలోని సర్వే నెంబర్ 11/4 లో 3.54 ఎకరాల్లో మైనింగ్ కు అనుమతి ఉందని చెప్పి కొంటాడు.. అది కూడా అనుమానమే. అయితే ఆస్థలం ప్రభుత్వ ఆసుపత్రి కి కేటాయించాలని దివంగత సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో నిర్ణయించారు. అయిన ఇప్పటికి టిడిపి నేత ఆస్థలంలో అక్రమంగా మైనింగ్ నిర్వహిస్తున్నారు.
గత టిడిపి పాలనలో ఏకంగా పది ఎకరాలు ఆక్రమించి మైనింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆ స్థలంలో తమకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని స్థానిక పేదలు.. అధికారులను కోరారు.. దీంతో 28 మందికి అధికారులు ఇంటి స్థలాలు కేటాయించారు.. చదును కార్యక్రమాలు కూడా చేస్తుండగా టిడిపి నేత జయరామి రెడ్డి తన అనుచరులతో కలిసి అడ్డుకోవడంతో స్థానికులు ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ముళ్ళూరు కృష్ణాపురంలో పేదలకు ఇంటి స్థలాలు కేటాయించారని, కానీ కొందరు అడ్డుకొంటున్నారని శాంతిపురం ఎమ్మారో విజయలక్ష్మి అన్నారు.
టిడిపి నేత జయరామి రెడ్డి అక్రమంగా నిర్వహిస్తున్న క్వారీలో గతంలో ఇద్దరు కార్మికులు చనిపోయారు. అయిన పట్టించు కోలేదు.. ఇప్పుడు స్థానికులనే బెదిరిస్తూ దాడులకు ఉసి గొల్పుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇతడికి చంద్రబాబు కు ప్రధాన అనుచరుడు ఎమ్మెల్సీ గౌరవాని శ్రీనివాసులు అండదండలు ఎక్కువగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.