Idream media
Idream media
ఒక పార్టీ నేత ఇంటి ఎదుట, లేక కార్యాలయం ఎదుట వేరొక పార్టీ నేతలు ఆందోళన చేయడం సర్వసాధారణం. అలాగే ఎన్నికల సమయంలో టికెట్లు కేటాయింపులో అన్యాయం జరిగితే కొంత మంది సొంత పార్టీ నేతల కార్యాలయాల ఎదుట నిరసన దిగడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక పార్టీ నేతలు వేరొక పార్టీ నేత ఇంటి ఎదుట ఆందోళన జరగటం లేదు. అలాగని ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు..సొంత పార్టీ నేత ఇంటి ముందు ఆందోళన చేయడానికీ..కాని ఒక పార్టీ అధినేత ఇదే వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు.
పార్టీ అధినేత ఇంటి ముందు సొంత పార్టీ నేతే ఆందోళనకు దిగారు. ఇది ఏ పార్టీ నేత గురించి చెబుతున్నానంటే..? టిడిపి అధినేత చంద్రబాబు గురించి. ప్రతిపక్షనేత, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఆయన వ్యవహారిక శైలిపై టిడిపి నేతలు మండిపోతున్నారు. చంద్రబాబుపై ఆయన పార్టీ నేతలే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఇంటి ముందు సొంత పార్టీ నేతలే ఆందోళనకు దిగుతున్నారు.
వెంకటేశ్వరరావు అనే టిడిపి నాయకుడు చంద్రబాబు ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. చంద్రబాబు తనను రాజకీయంగా 30 ఏళ్లగా వాడుకొని వదిలేశారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ కార్పొరేటర్‌గా వెంకటేశ్వరరావు పోటీ చేసి ఓడిపోయారు. తన సమస్యలను చెప్పుకోవడానికి కూడా చంద్రబాబు సమయం ఇవ్వడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వెంకటేశ్వరరావు బాబు ఇంటిముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు.