iDreamPost
android-app
ios-app

అచ్చెం నాయుడు రిమాండ్‌ పొడిగింపు.. మాజీ మంత్రికి నడుం నొప్పి, విరేచనాలు..?

అచ్చెం నాయుడు రిమాండ్‌ పొడిగింపు.. మాజీ మంత్రికి నడుం నొప్పి, విరేచనాలు..?

ఈఎస్‌ఐ స్కాంలో ఏసీబీ అరెస్ట్‌ చేసిన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెం నాయుడు రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించింది. ఈ రోజుతో రిమాండ్‌ గడువు ముగియడంతో అధికారులు ఆన్‌లైన్‌ ద్వారా అచ్చెం నాయుడును ఏసీబీ కోర్టులో హాజరపరిచారు. విచారించిన న్యాయస్థానం జూలై 10వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అచ్చెంనాయుడు ప్రస్తుతం జీజీహెచ్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

కాగా, ఏసీబీ కస్టడీ చివరిదైన మూడో రోజు అధికారులు ట్విస్ట్‌ ఇచ్చారు. మొదటి రోజు మూడు గంటలు, రెండో రోజు ఐదుగంటలు ఈ రోజు రెండున్నర గంటల పాటు ప్రశ్నించిన అధికారులు మధ్యాహ్నమే విచారణ ముగించి వెళ్లిపోయారు. ఏసీబీ విచారణ ముగిసిందని అందరూ భావించగా రాత్రి మళ్లీ అధికారులు ఆస్పత్రికి వచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు అర్థరాత్రి 12 గంటల వరకూ తమ కస్టడీలో ఉన్నట్లేనని చెప్పిన అధికారులు అచ్చెం నాయుడును మళ్లీ ప్రశ్నిస్తున్నారు.

అచ్చెం నాయుడుకు ఫైల్స్‌ ఆపరేషన్‌ జరగగా ఆ గాయం మానుతున్నట్లుగా వైద్య అధికారులు చెబుతున్నారు. అయితే ఆయన్ను ఎప్పుడు డిశ్చార్జి చేస్తారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. అయితే ప్రస్తుతం అచ్చెం నాయుడుకు విరేచనాలు అవుతున్నట్లుగా చెబుతున్నారు. అంతే కాకుండా తనకు నడుం నొప్పిగా ఉన్నట్లు అచ్చెం నాయుడు వైద్యులకు చెబుతున్నారని సమాచారం.