iDreamPost
android-app
ios-app

అచ్చెన్నా..ఇదేందన్నా? మీదీ రెండుకళ్ల సిద్ధాంతమేనా?

అచ్చెన్నా..ఇదేందన్నా? మీదీ రెండుకళ్ల సిద్ధాంతమేనా?

అవును ..నిజమే..అచ్చెన్నాయుడు మాటలు వింటుంటే సామాన్య మానవునికైనా కలిగే సందేహం ఇదే. అరాచకాలు సాగవన్న భయంతోనే పంచాయతీ ఎన్నికలను అడ్డుకున్నారని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఆరోపించారు. అదీ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం అంటూనే. అమ్మఒడి సభకు రాని కరోనా అడ్డంకి.. ఎన్నికలకు ఎందుకు? ప్రజల మద్దతు ఉంటే భయమెందుకు? అంటూ జగన్ సర్కార్ ను నిలదీశారు. అయితే అచ్చేన్న మాటలు గురవిందను గుర్తు చేస్తున్నాయంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. గత మార్చిలో ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ఎందుకు ఇలా ప్రశ్నించలేదో అర్థం కాక జనం గింజచుకుంటున్నారు. అప్పడు అసలు కరోనా ఏపీలో ఇంకా విజృంభించలేదు.. కాని దానిని సాకుగా నిమ్మగడ్డ ఎన్నికలు వాయిదా వేస్తే ఈదే అచ్చెన్న ఎందుకు మౌనం వహించినట్లు? అది పక్కన పెడితే ప్రజల మద్దతు ఉంటే భయమెందుకు అని ప్రశ్నించిన అచ్చెన్న అప్పుడు ఎన్నికల వాయిదా వేసినప్పుడు టీడీపీకి ప్రజల మద్ధతు లేకనే సంబరాలు చేసుకుందా? అందుకే ఎస్ఈసీ నిమ్మగడ్డకు అండగా నిలిచిందా? అని సామాన్య మానవుడి ప్రశ్నకు అచ్చెన్న సమాధానం చెప్పగలరా?

ఈ విషయం పక్కన పెడదాం.. అచ్చెన్న మరో మాటన్నారు.. ఉద్యోగ సంఘాలను కూడా ఈ కుట్రలో భాగస్వామ్యం చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే టీడీపీ సర్కార్ ఉన్నప్పుడు అప్పటి ఎన్జీవో నేత అశోక్ బాబు.. ఎన్ని సందర్బాల్లో ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారో అచ్చేన్న గుర్తుచేసుకోవాలి. ప్రభుత్వానికి అండగా నిలిచి, బాకా ఊదినందుకేగా అశోక్ బాబు ఈరోజు ఎమ్మెల్సీ పదవిలో కుర్చుంది. వాస్తవానికి ప్రజాధనంతో జీతాలు తీసుకుంటున్న ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు ఒకరికి ఒకరు సామరస్యంగా ఉండాలి. మీకు ఉద్యోగ సంఘాలు మద్దతు పలికితే న్యాయం.. మరి ప్రస్తుత ప్రభుత్వానికి మద్ధతు (వాళ్లు పలికింది మద్ధతు కాదు..కరోనా ఆందోళన వ్యక్తం చేశారు) మాత్రం ఉద్యోగ సంఘాలను కుట్రలో భాగం చెయ్యడమా? ఎంత గొప్పగా చెప్పారు అచ్చెన్నా?

ఎస్ఈసీ నిమ్మగడ్డ.. ఎన్నికలు వాయిదా వేసినప్పుడు సర్కార్ కోర్టు మెట్లెక్కింది.. కోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఎస్ఈసీ నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పు చెబితే మాత్రం మీరు మాట్లాడరు.. అంటే నిమ్మగడ్డ కోర్టుకు నిజమైన సమచారం ఇచ్చినట్లు.. మరి ఇప్పుడు కోర్టు సర్కార్ కు అనుకూలంగా తీర్పు ఇస్తే ..ప్రభుత్వం కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినట్లా? అంటే నిమ్మగడ్డకు అనుకూలంగా ఉంటే సై..లేకుంటే నై..నా? హన్నన్నా అచ్చెన్నా !

ఇక్కడ మరో విషయం గుర్తుకు వస్తుంది. అదీ ప్రస్తుతం బర్నింగ్ టాపిక్కే.. ఆళ్లుగడ్డలో ఓవెలుగు వెలిగిన భూమా దంపతులు కూతురు, మీ పార్టీ నాయకురాలు, అందులో మాజీ మంత్రి ప్రస్తుతం భూవివాదం కేసులో అరెస్టైతే ఇంతవరకు టీడీపీ స్పందించలేదు.. టీడీపీ ఏపీ చీఫ్ గా నోరు ఏెందుకు మెదపలేదు. పైగా ఇదే అచ్చేన్నాయుడు.. ఈఎస్సై కుంభకోణంలో అరెస్టైతే ఇదే టీడీపీ ఎంత రాద్దాంతం చేసింది.. ఓ బీసీని అరెస్ట్ చేస్తారా అంటూ కులంకార్డును కూడా ఉపయోగించింది.. రచ్చరచ్చచేసింది. మరి ఓ ఆడపడుచు.. అదీ మీపార్టీకి చెందిన నాయకులురాలు మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టైతే అచ్చెన్న ఎందుకు మొహం చాటేసినట్లు? ఓహ్..టీడీపీ అధినేత చంద్రబాబుది రెండు కళ్ళ సిద్దాతం కదా? ఇప్పుడు అచ్చెన్నది అదే సిద్దాతం ఫాలో కావాలి కదా? అంటే మీకు ఉపయోగం ఉంటే మాత్రమే ఎవరినైనా వేనుకేసుకుంటారు.. ప్రయోజనం లేకుంటే ..సొంత మనిషైనా..(మాజీ మంత్రి అఖిలప్రియలాగా) తీసికట్టు నాగం బొట్లు అన్నట్లు వదిలేస్తారన్న మాట?