Idream media
Idream media
ఉత్తరాంధ్ర రాజకీయాలు ఇప్పుడు మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జయాపజయాలపై టీడీపీ చెబుతున్న లెక్కలతో ఇక్కడి రాజకీయాలు ఒక్కసారిగా వేడేక్కాయి. టీడీపీ చెబుతున్న లెక్కలకు వైసీపీ కూడా ఘాటుగానే స్పందించింది. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ చేస్తున్న ప్రచారంలో పస లేనప్పటికీ ఇప్పుడే ఎందుకు ఈ వాదన తీసుకొచ్చింది అనేది ఆలోచించాల్సి అవసరం ఉంది.
ఇప్పుడే ఎందుకీ ఆరాటం..
వాస్తవ లెక్కలు కళ్లేదుటే కనిపిస్తున్నా టీడీపీ ఎందుకు జయాపజయాల లెక్కలపై ఇంతలా ప్రచారం చేస్తుంది అనేదానిపై అందరి దృష్టి పడింది. విజయనగరం జిల్లాలో మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 955 స్థానాలకు 759 చోట్ల వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే సర్పంచ్ పీఠాలను దక్కించుకున్నారు. టీడీపీ 149 సీట్లకే పరిమితమైంది. ఓటర్లు తీర్పు స్పష్టంగా ఉన్నప్పటికీ , వాస్తవ లెక్కలు కనిపిస్తున్నప్పటికీ టీడీపీ మాత్రం దాన్ని అంగీకరించడం లేదు. ఇదంతా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటర్ల సానుభూతి పొందడం కోసమేనా? అనే సందేహం కలుగుతుంది.
పదేపదే పంచాయతీ ఎన్నికల్లో విజయాలపై టీడీపీకి చెందిన నాయకులు కొందరు చర్చించడం దానికి బలాన్ని చేకూరుస్తుంది. టీడీపీకి కంచుకోటగా ఉన్న విజయనగరం కార్పొరేషన్‌లో వైసీపీ బలం పుంజుకోవడంతో పాటుగా, ఆ జిల్లాలో ఉన్న బొబ్బిలి, నెల్లిమార్ల, సాలూరు, పార్వతిపురంలోనూ టీడీపీకి ఎదురుగాలి వీస్తుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన టీడీపీ మున్సిపల్ ఎన్నికల్లో అదే ఫలితాలు ఎదురు కాకూడదని భావిస్తుంది. దానిలో భాగంగానే ప్రజల్లో పార్టీదెబ్బతినిందన్న భావన రాకుండా ఉండేందుకు, క్యాడర్ మనోధైర్యం కోల్పోకుండా చూసుకునేందుకే ఈ లెక్కలను తెరమీదకు తీసుకొచ్చిందా? అనే సందేహాలూ లేకపోలేదు.
ఇవిగో లెక్కలు..
ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి సొంత గ్రామం కవిరిపల్లిలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు అలమంద సుధమ్మ 647 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. కేంద్ర మాజీ మంత్రి కిశోర్‌చంద్రదేవ్, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు మూకుమ్మడిగా కురుపాంలో తాడంగి గౌరిని టీడీపీ తరపున మద్దతిచ్చి ఎన్నికల్లో నిలిపారు.
కానీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, పార్టీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు మద్దతుతో పోటీలో నిలిచిన గార్ల సుజాత 92 ఓట్లతో విజయం సాధించారు. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు సొంత గ్రామం చినమేరంగిలోనూ భంగపాటు తప్పలేదు. అక్కడ వైఎస్సార్‌సీపీ మద్దతుదారు అల్లు రవణమ్మ 119 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. మాజీ మంత్రి కిమిడి మృణాళిని సొంత ఊరైన చీపురుపల్లి మేజర్ పంచాయతీలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు మంగళగిరి సుధారాణి విజయం సాధించారు.
పూసపాటిరేగ మండలం చల్లవానితోట పంచాయతీలో టీడీపీ మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి నాయుడి మనుమడు తారకరామానాయుడిపై వైఎస్సార్‌సీపీ మద్దతుదారైన పతివాడ వరలక్ష్మి గెలుపొందారు. పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు సొంతగ్రామమైన కష్ణపల్లి పంచాయతీలో గందరగోళం సష్టించినా ఎమ్మెల్యే అలజంగి జోగారావు అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ మద్దతుతో పోటీచేసిన బోనురామినాయుడు 174 ఓట్లతో విజయం సాధించారు. గంట్యాడలో మాజీ ఎమ్మెల్యే కె.ఎ.నాయుడికీ భంగపాటు తప్పలేదు. అక్కడ కూడా వైఎస్సార్‌సీపీ జెండా ఎగిరింది.
టీడీపీ నేతలు ఎంత ప్రయత్నించినా రాబోయే పరిషత్,మున్సిపల్ ఎన్నికల్లో పుంజువుకోని ,గౌరవప్రదమైన స్థానాలు గెలవటం కష్టం.