iDreamPost
iDreamPost
తెలుగుదేశం సీనియర్ నేత మాజీ కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కరోనా బారిన పడినట్టు ఆయన తరుపు న్యాయవాది వెల్లడించారు. ఈఎస్ఐ స్కాం లో అరెస్ట్ అయి జుడిషియల్ రిమాండ్ లో ఉన్న ఆయన ఆరోగ్య సమస్యల కారణంగా స్థానికంగా ఉన్న రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో నిన్నటి రోజు నుంచి అచ్చెన్నాయుడుకి జలుబు చేయడంతో ముందు జాగ్రత చర్యగా డాక్టర్లు కరోనా పరీక్ష నిర్వహించగా ఆయనకు పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
ఇప్పటికే అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్తితి పై ప్రతివారం హైకోర్టు ఆదేశాలతో బులిటెన్ కోర్టుకు సమర్పిస్తున్న డాక్టర్లు. ఆయనకి రమేష్ ఆసుపత్రిలోనే కరోనా చికిత్స అందిస్తున్నారు. ఇదే విషయానికి సంభందించి హైకోర్టుకు లేఖ రాసే ఆలోచనలో అచ్చన్న ఉన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా అచ్చెన్నాయుడు, ఈ కరోనా మహమ్మారి బారినుండి త్వరగా బయటపడాలని ఆశిద్దాం.