iDreamPost
android-app
ios-app

టిటిడి ఆస్తులు మీద నాడు నిర్ణయం నేడు యాగీ చేయటం ఎందుకు ?

టిటిడి ఆస్తులు మీద నాడు నిర్ణయం  నేడు యాగీ చేయటం ఎందుకు  ?

టిటిడి ఆస్తులు టిడిపి హయంలోనే అమ్మాకానికి నిర్ణయం తీసుకున్నారని, కానీ ఇప్పుడు ఎల్లో మీడియా నానాయాగీ చేస్తుందని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీ నివాసరావు విమర్శించారు. అన్ని మతాల వారికి అండగా ఉండటమే తమ అభి మతమన్నారు. ఆదివారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ…టిటిడి ఆస్తులను ప్రభుత్వం అమ్మివేస్తుందంటూ ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని, టిడిపి హయంలో టిటిడి చైర్మన్ గా ఉన్న టిడిపి నేత చదలవాడ కృష్ణమూర్తి, సభ్యుడుగా బిజెపి నేత భాను ప్రకాష్ రెడ్డి ఉన్నప్పుడే టిటిడిలో ఉపయోగం లేని భూములను ఆప్షన్ వేసేలా ఒక కమిటీ వేశారని గుర్తు చేశారు. 50 రకాల ఆస్తులను అమ్మలని ఆనాడే గుర్తించారని తెలిపారు.

అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏదో జరిగి పోతుందని ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబులా చీకటి జీవోలు ఇచ్చి అమ్మేసే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి లేదని, టిటిడి ఆస్తులు అమ్మినా డిపాజిట్లుగానే పొందుపరుస్తామని చెప్పారు. చంద్రబాబులా… సదావర్తి భూమలు దొంగ చాటుగా వేలం వేసేలా…అలాంటి చర్యలు తమ ప్రభుత్వం ఎన్నటికి చేయదని పేర్కొన్నారు. చంద్రబాబుకి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం ఉంటే..అప్షన్ లో పాల్గొని దేవుడి భూమిని ఎక్కువ డబ్బులకు కొంటే దేవుడికే ఆ డబ్బులు వస్తాయన్నారు. టిటిడిలో ఉపయోగం లేని భూములను ఆప్షన్ వేసేలా టిడిపి హయాంలో ఒక కమిటీ తీసుకువస్తే..ఈనాడు ఆంధ్రజ్యోతి.. ఆరోజు ఎందుకు ప్రశ్నించలేదని ఆగ్రహం వ్యక్త చేశారు. చంద్రబాబు చేస్తే ఒప్పు…జగన్మోహన్ రెడ్డి చేస్తే తప్పా అని ప్రశ్నించారు. తన పాలనలో దేవుళ్ల గుడులను కూల్చివేసిన నీచుడు చంద్రబాబు అని విమర్శించారు.

టిటిడి ఆస్తులు అమ్మితే జగన్ కి గాని, తనకి గాని ఒక్క రూపాయి రాదని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. చంద్రబాబులా దోచుకోవాలనే ఆలోచన జగన్ మోహన్ రెడ్డికి లేదని, గత ప్రభుత్వం చేసిన వాటిలో మంచిని సేకరిస్తామని, చెడును ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

జగన్ ఏడాది పాలనలో 90 శాతం హామీల అమలు

ప్రజలను కష్టాల్లో ఉన్నపుడు ఆదుకున్న వాడే నిజమైన నాయకుడని, జగన్ నిరంతరం ప్రజల పక్షానే ఉన్నారని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలనలో అవినీతి తరిమికొట్టారన్నారు. మ్యానిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావించిన నాయకుడు సిఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. మ్యానిఫెస్టోలో 90 శాతం హామీలను అధికారం చేపట్టిన మొదటి ఏడదిలోనే పూర్తి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు.

టిడిపి పాలన..వైసిపి పాలనపై చర్చకు సిద్ధమా?

టిడిపి ఐదేళ్ల పాలన…వైసిపి ఏడాది పాలనపై చర్చకు తాము సిద్ధమని, చంద్రబాబు దమ్ము ఉంటే చర్చకు రావాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీ నివాసరావు సవాల్ విసిరారు. సిఎంగా ఏడాది కాలంలో ఎన్నడూ లేని విధంగా ప్రజా సంక్షేమ పాలన అందిచారన్నారు. పాలనలో అభివృద్ధి అజెండాగా ముందుకు సాగుతున్నామన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా సిఎం జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారన్నారు. మ్యానిఫెస్టో ని ఆన్ లైన్ లోంచి తీసేసిన నాయకుడు చంద్రబాబు అని, ఆయన ప్రజలకు ఇచ్చిన హామీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు.

టిడిపి హయంలో విజయవాడ నిర్లక్ష్యానికి గురైంది

గత టిడిపి ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో విజయవాడ నిర్లక్ష్యనికి గురైందని, సిఎం జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక నగర అభివృద్ధికి నిధులు కేటాయించారని పేర్కొన్నారు. విజయవాడకు రూ.500 కోట్ల నిధులు కేటాయించడంతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. సిఎం జగన్మోహన్ రెడ్డి ఒక పక్క కరోనా పై నియంత్రణ చర్యలు చేపడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలను అందాలన్న మంచి లక్ష్యం తో పనిచేస్తున్నారన్నారు. తాము పవన్ కళ్యాణ్ లా ఫామ్ హౌస్ లో తాగి పడుకోవడం లేదని ఎద్దేవా చేశారు.