iDreamPost
android-app
ios-app

అబ్దుల్ సలాం ఆత్మహత్య కేసులో తెలుగుదేశం ద్వంద్వ నీతి

  • Published Nov 10, 2020 | 11:22 AM Updated Updated Nov 10, 2020 | 11:22 AM
అబ్దుల్ సలాం ఆత్మహత్య కేసులో తెలుగుదేశం ద్వంద్వ నీతి

ప్రజలని కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేయి అన్నటు ఉంది ప్రతిపక్ష తెలుగుదేశం వ్యవహారం. ప్రతి విషయంలోను రాజకీయ లబ్దిని ఆశించి జగన్ ప్రభుత్వం పై అవాస్థవాలను ఒకటికి పది సార్లు ప్రచారం చేయడం, నిజాలను ప్రజలు గ్రహించి నిలదీసే సమయానికి మొహం చాటేయటం వారికి ఈ మధ్య కాలంలో పరిపాటిగా మారింది. అధికారం కోల్పొయిన రోజు నుంచి రోజుకొక అబద్దంతో కుల, మత, ప్రాంతాల మధ్య వైషమ్యాలను పెంచేలా తెలుగుదేశం ఆడుతున్న రాజకీయ క్రీడతో ఇప్పటికే వారిపట్ల ప్రజల్లో చులకన భావం ఏర్పడినా ఇంకా వారి తీరు మారినట్లు కనిపించడం లేదు.

నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసు ఏపీలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆర్థిక సమస్యలతో వారు ఆత్మహత్య చేసుకున్నారని తొలుత అంతా భావించినా పోలీసుల వేధింపులే సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకునేలా పురికోల్పాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఈ కేసును సీరియస్ గా తీసుకున్న ముఖ్యమంత్రి జగన్ బాధ్యుల మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దర్యాప్తు కోసం ఇద్దరు ఐపీఎస్‌లు, బెటాలియన్స్‌ ఐజీ శంకబ్రత బాగ్చీ, గుంటూరు అడిషనల్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ను నియమించారు.

సీఎం జగన్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు లోతైన దర్యాప్తు చేసి అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్యకు బాధ్యులుగా సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ గంగాధర్‌ను అరెస్టు చేసి 323,506,509,306 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. అయితే నిందితులుగా ఉన్న సీఐ, హెడ్ కానిస్టేబుల్ కు 24 గంటల్లో బెయిల్ రావడంతో వారు విడుదలయ్యారు.

అయితే ఈ సంఘటనను ఆసరాగా చేసుకుని తెలుగుదేశం నాయకులు అచ్చం నాయుడు, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ అబ్దుల్ సలాం కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయలేదని , ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే వారికి 24 గంటల్లో బెయిల్ వచ్చిందని, ప్రభుత్వం బాధితుల పక్షం కాకుండా నేరస్తుల పక్షం నిలిచిందని, అబ్దుల్ సలాం పేద మైనారిటీ వర్గానికి చెందినవాడు కావడంతోనే ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిసుందని తీవ్రమైన ఆరోపణలు చేశారు.

సరిగ్గా ఇక్కడే తెలుగుదేశం పార్టి భుజానికెత్తుకున్న ద్వంద నీతి మరోసారు బయటపడిది. నిజానికి ప్రభుత్వం అబ్దుల్ సలాం కేసులో నిజాయతీగా వ్యవహరించి సీఎం స్థాయిలో స్పందించి ఒక స్పెషల్ టిం ను ఏర్పాటు చేసి అరోపణలు ఎదుర్కుంటున్న వారిపై కేసు నమోదు చేస్తే, వారికి బెయిల్ వచ్చేలా చేసింది మాత్రం తెలుగుదేశం కీలక నేత అనే వాస్తవాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు సదరు తేదాపా నాయకులు ,అబ్దుల్ సలాం కేసులో నిందారోపణలు ఎదుర్కుంటున్న వారిపై అధికారులు పలు సెక్షన్లతో పాటు 306 కూడా నమోదు చేస్తే తన క్లయింట్ అయిన సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ కు ఆ సెక్షన్ వర్తించదని కోర్టులో వాదించింది తెలుగుదేశం పార్టీకి చెందిన నంద్యాల వ్యక్తి వెదుర్ల రామచంద్రరావు అనే మాట వినిపిస్తుంది.

ఈ వ్యక్తి గతంలో తెలుగుదేశం పార్టీ పాలనా హయాంలో కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గా తాజాగా తేదాపా నియమించిన సభ్యుల్లో రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఉన్నారు. తెలుగుదేశంతో బలమైన సంభందాలు ఉన్న వ్యక్తి ద్వారా నిందితులు బెయిల్ పొందితే , అదే తేదాపా పార్టీ బెయిల్ రద్దు కోసం కౌంటర్ దాఖలు చెయబోతున్న ప్రభుత్వాన్ని విమర్శించడం ఆ పార్టీ ద్వంద్వ నీతికి మరో నిదర్శనం అని పలువురు చెబుతున్న మాట. ఏది ఏమైనా తెలుగుదేశం ద్వంద్వ నీతి చూస్తే ప్రజలని కన్విన్స్ చేయలేకపొతే కంఫ్యుజ్ చేయి అన్నట్టుగా ఉంది.