iDreamPost
iDreamPost
రాజధాని వికేంద్రీకరణకు సిఫార్సు చేస్తూ నివేదిక ఇచ్చిన అమెరికా మేనేజ్ మెంట్ సంస్థ బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూప్(BCG) పై తెలుగుదేశం సోషల్ మీడియా కక్ష కట్టింది. అమరావతిని తన బ్రాండ్ గా మార్చుకోవాలని చూసిన చంద్రబాబు ఆశలను అడియాసలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతాల మధ్య అసమానతలు తొలగి అన్ని ప్రాంతాలు ఏకకాలంలో అభివృద్ది చెందాలి అంటే పరిపాలన వికేంద్రికరణే సరైన మార్గం అని చెప్పిన బోస్టన్ గ్రూప్ పై వికిపిడియా వేదికగా విష ప్రచారానికి తెరలేపారు.
బోస్టన్ గ్రూప్ కి ఉన్న విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా ఆ కంపెని గురించి పూర్తి సమాచారం అందుబాటులో ఉండే వికీపిడియా పేజ్ ని పలుమార్లు సవరించి తప్పుడు సమాచారం పొందుపరిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ కి బోస్టన్ గ్రూప్ తమ నివేదికను అందించిన జనవరి 3వ తేదీనే తెలుగుదేశం సోషల్ మీడియా బోస్టన్ గ్రూప్ వికిపిడియా పేజ్ పై ఈ దాడి మొదలు పెట్టింది.
జనవరి 3న బోస్టన్ గ్రూప్ గా ఉన్న కంపెనీ పేరుని బోస్టన్ “బోగస్” గ్రూప్ గా, బోస్టన్ “బఫూన్” గ్రూప్ గా మార్చారు. బ్రూస్ హ్యాండర్సన్ గా ఉన్న వ్యవస్థాపకుడి పేరు సరసన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డిల పేరును జత చేసారు. అలాగే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి బోస్టన్ గ్రూప్ లో 50% వాటా ఉన్నట్టుగా పొందుపరిచారు. ఈ దాడిని గుర్తించిన ఆ సదరు కంపెనీ అప్రమత్తమై వెంటనే పొందుపరిచిన తప్పుడు సమాచారాన్ని సవరించినా, అప్పటికే తెలుగుదేశం సోషల్ మీడియా తాము చేసిన ఈ పనిని స్క్రీన్ షాట్స్ తీసి ఫేస్ బుక్ , ట్విట్టర్ లాంటి సోషల్ మీడీయా మధ్యమాల్లో తప్పుడు ప్రచారానికి తెర లేపారు. గతంలో కూడా తిరుమల తిరుపతి దేవస్తానంకి చైర్మెన్ గా నియమితులైన వై.వి సుబ్బారెడ్డి గారి వికిపిడియా పేజిలో ఇదే తెలుగుదేశం సోషల్ మీడియా సానుభూతిపరులు ఆయన మతాన్ని హిందు నుంచి క్రైస్తవ్యానికి మార్చి ఫేస్ బుక్ ట్విట్టర్ లాంటి సొషల్ మిడియాలో మాధ్యమాల వేదికగా తప్పుడు ప్రచారానికి తెరలేపింది.
అనేక విభాగాలకు చెందిన సమాచారాన్ని ప్రజలకు అందించే వికిపీడియా ఇలా తప్పుడు సమచారం పొందుపరిచేవారికి ఇటివల ఒక ఆయుధంగా మారింది. దీనికి కారణం సమాచార పొందుపరిచే ఈ ఫ్లాట్ ఫార్మ్ నిర్మాణంలో వికిపీడియా సంస్థ తగిన ప్రమాణాలు పాటించకపోవటమే అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖాతాదారుల వివరాలను గోప్యంగా ఉంచటంలో విఫలమైన ఫేస్బుక్ అమెరికా చట్టసభ ముందు సంజాయిషీ ఇచ్చుకుంది. అనేక కోర్టుల్లో ఈ విషయం మీద కేసులు నడుస్తున్నాయి. సమాచార సవరణను ,సమాచార విశ్వసనీయతను సరిచూసే చర్యలు తీసుకోకుంటే వికీపీడియా కూడా తన విశ్వసనీయతను కోల్పోవటంతో పాటు,న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోకతప్పదు.
ముందుగా తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు బోస్టన్ గ్రూప్ పై విమర్శలు చేయడం దాని తరువాత తెలుగుదేశం సానుభూతిపరులు సోషల్ మీడియాలో ఆ కంపెనీ మీద సైబర్ దాడి చెయటం ఒక్ ఆర్గనైజ్డ్ క్రైం గా భావించి సైబర్ క్రైం వారు తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.