iDreamPost
android-app
ios-app

టీడీపీ మార్కు ‘ఫిర్యాదు’ రాజకీయం

  • Published Aug 27, 2020 | 7:34 AM Updated Updated Aug 27, 2020 | 7:34 AM
టీడీపీ మార్కు ‘ఫిర్యాదు’ రాజకీయం

మనకు నచ్చని ఒక వ్యక్తి మీద పదేపదే తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే.. ఏదో ఒక నాటికి అదే నిజమని నమ్మే పరిస్థితి వస్తుంది. నైతికంగా ఇది పతనం చెందడం లాంటిదే అయినప్పటికీ దీనికే అలవాటు పడ్డ కొందరికి ఇది తప్పుగా అన్పించదు. అందునా టీడీపీ స్ట్రాటజీ వెన్నుపోటే అంటూ ప్రత్యర్ధులు చెబుతున్న మాదిరిగానే ఆ పార్టీ వ్యవహారాలు కూడా కొనసాగుతున్నాయన్నది రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చసాగుతోంది.

అధికారం కోల్పోయిన నాటి నుంచి ఆ పార్టీ అధినేతతోపాటు నేతలకు కంటిమీద కునుకుదూరమైందన్నది వారి చర్యలను బట్టే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు వైఎస్సార్‌సీపీపై మాత్రమే వారు పోరాడుతూ వచ్చారు. అయితే ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు పదవీ బాధ్యలు చేపట్టాక టీడీపీకి నేరుగా రెండు ప్రతిపక్షాలు తయారయ్యాయనే చెప్పాలి. సోము వీర్రాజు కూడా ఏపీలో ప్రతిపక్ష స్థానాన్ని కైవసం చేసుకుంటాం అంటూ సన్నిహితుల వద్ద పలు సార్లు నేరుగా కూడా చెప్పుకొస్తున్నారు. దీంతో ఇప్పుడు టీడీపీ ఫిర్యాదుల రాజకీయానికి తెరతీసిందన్న పుకార్లు షికారు చేస్తున్నాయి.

ముఖ్యంగా రాష్ట్రంలో టీడీపీ ఎదుగుదలకు బీజేపీని ఒక నిచ్చెనమాదిరిగా వాడుకుందన్నది బీజేపీలోని ఒక వర్గం భావన. ఈ నేపథ్యంలో తనకు అనుకూలంగా ఉన్నప్పుడు బీజేపీ చంకనెక్కి, లేనప్పుడు బీజేపీని చంకనెక్కించుకుని టీడీపీ నాయకత్వం డబుల్‌గేమ్‌తో ఇప్పటి వరకు కాలం గడిపేసింది. అయితే బీజేపీ అధిష్టానం తీసుకున్న అనూహ్యం నిర్ణయాలతో ఇప్పుడు టీడీపీ తీవ్రడైలామాలో పడిపోయింది. దీంతో తమకు అనుకూలం కాని అధ్య«క్షుడు అయిన సోము వీర్రాజుపై బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదుల రూపంలో ప్రతి రోజు పంపిస్తోందన్నది రాజకీయవర్గాల భోగట్టా.

ఇందు కోసం నేరుగా టీడీపీ నాయకులే కాకుండా, బీజేపీ ముసుగువేసుకున్న టీడీపీ నాయకులను కూడా వినియోగించుకుంటోందన్నది తెలియవస్తోంది. బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు ఇప్పటికే ముగ్గురుని సస్పెండ్‌ చేసారు. దీంతో బీజేపీలో ఉంటూ టీడీపీకీ అనుకూలంగా మాట్లాడేవారి నాటికి తాళం వేసినట్టయింది. అయితే ఇది మింగుడుపడని టీడీపీ నాయకత్వం తమ వందమాగధులైన పత్రిక, టీవీ, సోషల్‌ మీడియాల ద్వారా సోము వీర్రాజుపై వ్యతిరేకంగా బీజేపీ అధిష్టానం దృష్టికి వెళ్ళేలా పలు మెస్సేజ్‌లను ట్రోల్‌ చేస్తోందన్నది వినికిడి. అంతే కాకుండా వీర్రాజు వ్యవహారశైలిని నిందిస్తూ అనేక ఫిర్యాదులను కూడా అధిష్టాం వద్దకు నేరుగానే పంపించారట కూడాను.

అయితే ఇదే విషయం సోము వీర్రాజు దృష్టికి వెళ్ళినప్పటికీ లైట్‌ తీసుకుంటున్నారని టాక్‌. ఇదిలా ఉండగా తెరవెనక రాజకీయం చేయడం టీడీపీకి ‘వెన్నుపోటు’తో వచ్చిన విద్యేనని సోము వర్గం కూడా ధీటుగానే సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతోందని వినికిడి.