ఏపీలో దేవాలయల్లో జరుగుతున్న అవాంఛనీయ ఘటనల వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందా? రాష్ట్రంలో మతకల్లోలాలు సృష్టించేందుకే విగ్రహాల ధ్వంసం జరుగుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ముఖ్యంగా టీడీపీ రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయడం కోసం ఇలాంటి కుట్రకు తెరతీసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.. పైగా డీజీపీ గౌతం సవాంగ్ ఆలయాల ఘటనల వెనుకు కుట్ర ఉందనగానే టీడీపీ స్పందించిన తీరు అనుమానాలకు బలం చేకూర్చుతోంది. ఎందుకంటే దాడుల వెనుక కుట్ర ఉంది అనగానే ఇంతకాలానికి తెలిసిందా డీజీపీకి అంటూ టీడీపీ స్పందించిన తీరు అనుమానాలను నిజం చేస్తోంది. ఎందుకంటే పరిస్తితి సున్నిత మైంది. అలాంటప్పుడు లోతుగా విచారాణ జరిపి ఆధారాలతోనే మాట్లాడాల్సి ఉంటుంది బాధ్యతా యుతమైన పోలీసులు.. అంతేకాని పోలీసులేమి దేవుళ్ళు కారు దివ్యదృష్టి ఏమీ వారికి ఉండదు. అలాంటప్పుడు విగ్రహం ధ్వంసం కాగానే ఫలానా వారు చేశారనో..కుట్ర ఉందనో ఎలా చెప్పగలరు.. ? ఆమాత్రం టీడీపీ వాల్లుకు తెలియదా? అది తెలిసి పోలీసులను అబాసు పాలు చేయడం ద్వారా కుట్రకోణంలో ఆలోచించకుండా ఉండేందుకు,పోలీసుల అత్మస్థైర్యం దెబ్బతీసేలా పోలీసులు మాట్లాడుతున్నారని పరిశీలకులు అంటున్నారు.
ఏపీలో జరిగిన విగ్రహాల విధ్వంసంపై డీజీపీ సవాంగ్ చెప్పిన ప్రకారం ఏడు ఘటనల్లో నేరుగా టీడీపీ నేతల ప్రమేయం, రెండు ఘటనల్లో నేరుగా బీజేపీ నేతల ప్రమేయం ఉంది. మరో తొమ్మిది కేసుల్లో 21 మంది టీడీపీ, బీజేపీ నేతల పాత్ర ఉంది. ఇప్పటి వరకు 15 మంది అరెస్ట్ చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా కుట్ర జరిగింది. ఘటనలకు పాల్పడిన వెంటనే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం, ఆపై రాజకీయం.. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే దురుద్ధేశం తోనే కుట్రలు జరిగాయి. అందుకే మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు డీజీపీ మీడియా సమావేశంలో స్పష్టంచేశారు. మరోవైపు.. ఆలయాల ఘటనల్లో రాజకీయ పార్టీల కుట్ర స్పష్టంగా కన్పిస్తోందని, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేందుకే టీడీపీ, బీజేపీకి చెందిన వారు ఇటువంటి చర్యలకు పాల్పడినట్టు దర్యాప్తులో తేలిందని డీజీపీ డి గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు.
వివరాల్లోకి వెళితే… రాజమండ్రిలో వినాయకుడి విగ్రహానికి తానే మలినం పూసి, తానే తప్పుడు ప్రచారం చేసిన ఘటనలో రాజమహేంద్రవరం రూరల్ మండలం పిడింగొయ్యి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వెల్లంపల్లి ప్రసాద్‌బాబు (బాబుఖాన్ చౌదరి)ను బొమ్మూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యక్తిగత పీఏ చిటికెన సందీప్ (టీడీపీ), అడపా సందీప్ (బీజేపీ), కరుటూరి శ్రీనివాసరావు(బీజేపీ)లు కూడా ఉన్నారని తెలుస్తోంది. గుంటూరు రూరల్ నరసరావుపేట శంకర్‌మఠంలో సరస్వతి విగ్రహం ధ్వంసం అయినట్టు తప్పుడు ప్రచారం చేసిన కేసులో టీడీపీకి చెందిన చల్లా మధుసూధన్‌రెడ్డి అరెస్టు అయ్యాడు. వైఎస్సార్ కడప జిల్లా కొండలవీడు గ్రామంలో ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సిద్ధం చేసిన భూమిలో కావాలని అవాంతరాలు సృష్టించేందుకు అక్కడ ఉన్న ఆంజనేయస్వామి విగ్రహానికి చెప్పుల దండ వేశారు. ఈ కేసులో టీడీపీ సానుభూతిపరుడైన బొజ్జన సుబ్బారెడ్డి(టీడీపీ)ని అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా మద్దమ్మ గుడిలో విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనలో టీడీపీకి చెందిన గొల్ల పెద్దయ్య, గెద్దా రామాంజనేయులు, బ్రమే జయరాముడు, సయ్యద్ ఫక్రుద్దీన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా మర్లమంద గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయ ఆర్చిలో సీతారాముల విగ్రహాల కాళ్లను ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన కేసులో టీడీపీకి చెందిన ఆలయ కమిటీ చైర్మన్ విశ్వనాథ్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇక ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని ఆర్చిలో లక్ష్మీనరసింహాస్వామి, చెంచులక్ష్మి, గరుత్మంతుడు విగ్రహాల ధ్వంసం ఘటనలో తప్పుడు ప్రచారం చేయడంపై టీడీపీకి చెందిన మద్దసాని మౌళాలి, గాలి హరిబాబు, కాకర్ల నరసింహారావులను అరెస్టు చేశారు. టీడీపీకి చెందిన మరో ముగ్గురు మించాల బ్రహ్మయ్య, వెల్పుల వెంకట్రావు, సిరిమల్లి సురేష్‌లు పరారీలో ఉన్నారు. విశాఖపట్నం రూరల్ జిల్లా ఏటిగైరంపేట గ్రామానికి చెందిన రామాలయంలో వినాయక విగ్రహం పగిలిపోయింది. ఈ కేసులో దుష్ప్రచారం చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన టీడీపీకి చెందిన కిలాడ నరేష్, పైల సత్తిబాబులను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట గ్రామంలో భూలోకమాత గుడిలో హనుమాన్ విగ్రహం ధ్వంసమైనట్టు తప్పుడు ఫొటోను మీడియాలో వైరల్ చేసిన కొంచాడ రవికుమార్(బీజేపీ)ను అరెస్టు చేశారు. వాస్తవానికి ఆ విగ్రహం రెండేళ్ల క్రితం తుపాను సమయంలో దెబ్బతింది. దాన్ని ఎవరో దుండగులు ఇప్పుడు ధ్వంసం చేసినట్టు తప్పుడు ప్రచారం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సరస్వతి దేవి విగ్రహం ఎప్పుడో దెబ్బతింటే ఇప్పుడు ఎవరో దుండగులు ధ్వంసం చేశారంటూ సోషల్ మీడియాలో ఫొటో వైరల్ చేసి మతపరమైన అలజడి రేపేందుకు ప్రయత్నించిన ధర్మవరపు ఆచార్య(బీజేపీ)ను పోలీసులు అరెస్టు చేశారు.
ఇంతకాలం ఎవరో ఆకతాయిల పని అనే ప్రచారం కూడా జరిగింది. కాని ప్రస్తుంత జరుగుతున్న సంఘటనలు, పోలీసుల అరెస్టులు చూస్తుంటే..రాజకీయ ప్రమేయం ఉందన్న సందేహాలకు బలం చేకూరుతోంది. పైగా దొంగే దొంగని మొత్తుకున్నట్లు.. రాజకీయ పార్టీల కార్యకర్తలే విధ్వంసాలకు పాల్పడుతుంటే.. ఆ పార్టీనేతలు ఆందోళనలు చేస్తూ..దురదృష్ట సంఘటనలను క్యాష్ చేసుకునే ప్రయత్నం చేసిన తీరు నిజంగా శోచనీయం. మరి ఈ కుట్ర వెనుకు ఉన్న రాజకీయ పెద్దలు ఎవరన్నది ఎప్పుడు బయపడుతుందా అని జనం ఎదురు చూస్తున్నారు. అలాంటి నీచులను రాష్ట్రం పొలిమేరలు దాటించాలని చూస్తున్నారు.