ఏమైంది తెలుగుదేశం నాయకులకు… ఎవరూ నోరు మెదపరేం..? ఎల్లో మీడియా లో దానిపై చర్చేది..? వైసీపీ నేతల సవాలుకు టీడీపీ నుంచి ఎవరూ స్పందించ లేదు ఎందుకో.. అంటే ఓడి పోయినట్లేనా… 108, 104 లో అక్రమాలు అంటూ చేసిన ఆరోపణలు అవాస్తమని ఒప్పు కున్నట్లేనా?? అంటే… అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి రాజకీయ వర్గాల్లో..
పేదల ఆపద్భాందవుడిగా.. గుర్తింపు పొందాయి 108 అంబులెన్స్ వాహనాలు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదలకు అందించిన వరాల్లో ఇదొక్కటి. ప్రమాదంలో ఉన్న పేదవాడు.. 108 నొక్కితే చాలు.. రయ్ రయ్ మంటూ క్షణాల్లో అంబులెన్స్ వచ్చేది. ప్రాణ దానం చేసేది. తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 108, 104 ఆవశ్యకతను గుర్తించి ప్రాముఖ్యత ఇవ్వాల్సింది పోయి.. నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఫలితంగా చాలా వాహనాలు పడకేసాయి.
మళ్లీ 2019లో జగన్ నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంబులెన్స్ లు ఊపిరి పోసుకున్నాయి. పేదలకు అందుబాటులోకి వచ్చాయి. 108, 104 వాహనాల నిర్వహణ, ఉద్యోగుల కష్టాలపై దృష్టి సారించారు. పాదయాత్రలో ఆయన ఇచ్చిన హామీ మేరకు 108 ఉద్యోగుల జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. లాబ్ టెక్నీషియన్, పారా మెడికల్ సిబ్బందికి 28,000కు జీతం పెంచారు. ఫలితంగా అంబులెన్స్ సేవల్లో పారదర్శకత వచ్చింది. 1064 కొత్త వాహనాల కొనుగోలుకు కూడా చర్యలు తీసుకున్నారు. జూలై ఒకటిన ప్రారంభోత్సవానికి కూడా సిద్దం అవుతున్నాయి.
టీడీపీ లొల్లి..
గత ప్రభుత్వ హయాంలో చతికిల పడ్డ 108 సేవల్ని జగన్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చింది. ఆపదలో ఉంటే అంబులెన్స్ వస్తదన్న భరోసా పేదలకు మళ్లీ కలిగింది. ఇది ఓర్వలేక అన్నట్లు టీడీపీ 108, 104 సేవలపై రాద్దాంతం మొదలు పెట్టింది. ఈ ఎస్ఐ స్కాంలో ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ కావడంతో విషయాన్ని పక్కదారి పట్టించేందుకు తెరపైకి 108, 104లో రూ. 307 కోట్ల స్కాం జరిగిందంటూ.. లొల్లి మొదలు పెట్టింది. దానికి చంద్రబాబు ఎల్లో మీడియా చర్చ వేదికలు పెట్టి విషయం పెంచేందుకు ప్రయత్నించింది. ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం ఆరోపణల దిశ గా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేసింది.
వైసీపీ ధీటైన జవాబుతో…
108, 104 పై టీడీపీ చేస్తున్న అసత్య ఆరోపణలను వైసీపీ నేతలు తిప్పికొట్టారు. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని ఆధారాలు సహా నిరూపించారు. జగన్ ఆదేశాల మేరకు జుడీసియల్ రివ్యూకు పంపిన తర్వాతే బిడ్ లు పెట్టినట్లు తెలిపారు. 108 సర్వీసెస్ కి అరబిందో ఫార్మా కన్సార్టియం, సర్వేసం అనే రెండు కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. మూడు నెలల కాలానికి కొత్త వాహనాల నిర్వహణకు గానూ రూ.6,12,222 కు అరబిందో టెండర్ వేసింది. అంత కన్నా తక్కువే.. 5, 34, 214కు ప్రభుత్వం ఇచ్చింది. అంటే నెలకు రూ.1, 78,072 నిర్వహణ ఖర్చు అవుతోంది. పాత వాహనాలకు నిర్వహణ ఖర్చు ఎక్కువ కాబట్టి వాటికి ప్రభుత్వం మూడు నెలలకు 6, 63, 772 ఇచ్చింది. అంటే నెలకు రూ.2,21,257. 104 నిర్వహణ నిమిత్తం పిరమిల్, అరబిందో బిడ్ లు దాఖలు చేశాయి.. పీరమిల్ వెనక్కి పోయింది. దీంతో 676 వాహనాలకు సంబంధించి.. ఒక్కో దాని నిర్వహణకు రూ 1, 80, 225 కేటాయిస్తూ.. అరబిందో కి ప్రభుత్వం కేటాయించింది. 108, 104 కి సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేసింది. ప్రభుత్వ పారదర్శకత చర్యల ద్వారా.. ప్రభుత్వానికి రూ.399 కోట్లు ఆదా అయినట్లు వైసీపీ నేతలు వెల్లడించారు. దీనిపై బహిరంగ చర్చకు మేం సిద్దమని, టీడీపీ అధినేత చంద్రబాబు నేరుగా వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. 307 కోట్లు కాదు కదా.. ఎక్కడ ఏ చిన్న పొరపాటు చూపించిన సరి దిద్దు కోవడానికి మేము సిద్దం అన్నారు. అప్పటి నుంచి టీడీపీ నేతల నోళ్ళు మూగ పోయాయి. వైసీపీ ఛాలెంజ్ స్వీకరణకు ఎవరూ ముందుకు రాలేదు. పైగా నిరాధార ఆరోపణలు చేస్తూ.. నవ్వుల పాలు కావద్దు అంటూ.. టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించినట్లు తెలిసింది.