iDreamPost
android-app
ios-app

సీఎం స్టాలిన్ పై కేసులు రద్దు

సీఎం స్టాలిన్ పై కేసులు రద్దు

దాదాపు పదేళ్ల తరువాత డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ నేతృత్వంలోని పార్టీ గెలిచి విజయదుందుభి మోగించింది. జయ పార్టీలో చీలిక రావడమే కాక, ఉన్న పార్టీలో కూడా పదవుల కోసం పందేరం మొదలు కావడంతో స్టాలిన్ పార్టీ చాలా తేలికగా గెలవగలిగింది. అయితే అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ పై పెట్టిన 18 క్రిమినల్ కేసులను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం మద్రాసు హైకోర్టు కీలక ప్రకటన చేసింది. అన్నాడీఎంకే పాలనలో ఆ ప్రభుత్వ పాలన, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ టెండర్లు, వాకీటాకీ కొనుగోళ్లు, లాంటి అనేక అంశాల మీద వ్యాఖ్యలు చేసిన స్టాలిన్ మీద క్రిమినల్, పరువు నష్టం సహా వివిధ నేరారోపణలకు సంబందించి 19 కేసులు ప్రభుత్వం తరపున నమోదయ్యాయి.

అలాగే కొన్ని ప్రభుత్వ వార్తల ప్రచురణకు సంబంధించి మురసొళి ఎడిటర్ సెల్వం, కలైజ్ఞర్ టీవీ ఎడిటర్ తిరుమావేలన్ మీద కూడా కేసులు పెట్టారు. అయితే ఈ కేసులను రద్దు చేయాలని కోరుతూ స్టాలిన్ తరపున గతంలో మద్రాసు హైకోర్టులో ఆయన న్యాయవాదులు పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ శుక్రవారం నాడు విచారణకు వచ్చింది. ఎఐఎడిఎంకె హయాంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ మీద దాఖలైన సుమారు 19 క్రిమినల్, పరువు నష్టం కేసులను మద్రాసు హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. స్టాలిన్ మీద 2016 నుంచి 2021 మధ్య వివిధ జిల్లా కోర్టులలో పెండింగ్‌లో ఉన్న కేసులను కొట్టి వేశారు. పరువు నష్టం కేసుల్లో ఎక్కువ భాగం 2018 నుంచి 2020 మధ్య దాఖలయ్యాయి. వాటిలో ఒకటి స్టాలిన్ 2020 డిసెంబర్ 7న శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తన కొలత్తూరు నియోజకవర్గాన్ని సందర్శించినప్పుడు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కూడా నమోదయింది.

అదే విధంగా, 2020లో ఆయనమీద మరో పరువు నష్టం కేసు దాఖలైంది. లాక్‌డౌన్ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి ప్రజలపై ఆర్థిక భారం మోపారని స్టాలిన్ విమర్శించారు. ఆ వ్యాఖ్యల మీద కూడా ఒక కేసు నమోదైంది. ఈ సిల్లీ రీజన్స్ తో ఉన్న కేసులను గమనించి డీఎంకే అధికారంలోకి రాగానే కేసులను ఉపసంహరించుకొంటున్నట్లు ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం ఆమోదించింది. స్టాలిన్ మీద ఉన్న కేసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జస్టిస్ ఎం నిర్మల్ కుమార్ దాఖలు చేసిన మొత్తం 19 క్వాష్ పిటిషన్లను కొట్టి వేసేందుకు అనుమతించారు.