సీఎం జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు అందుతున్న సంక్షేమం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. 2019 ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో ప్రజామోదం పొంది ముఖ్యమంత్రి అయిన జగన్ తాను మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని గెలిచిన ఏడాదిలోనే 90% నెరవేర్చి రాజకీయాల్లో నిజాయతీకి నిబద్దతకు ట్రేడ్ మార్క్ గా మారారు.
సీఎంగా జగన్ అందిస్తున్న పాలనలో ప్రజలకు అందుతున్న సంక్షేమాన్ని గమనిస్తున్న ఇతర రాష్ట్ర పార్టీ అధినేతలు, నాయకులు జగన్ పై ఇప్పటికే ముక్తకంఠంతో ప్రశంశల వర్షం కురిపిస్తూ వచ్చారు. కొన్ని పేరుమోసిన స్థంస్థలు చేసిన సర్వేలో అత్యుత్తమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రుల్లో జగన్ అగ్రస్థాన్నాన్ని సంపాదించుకున్నారు. ప్రధాని సహా కేంద్ర మంత్రులు ఎందరో ఏపీ అవలంబిస్తున్న విధానాలను ఇతర రాష్ట్రాలు కూడా అవలంబించాలని కోరుకుంటున్నాం అంటూ చెబుతున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని ప్రధాని మోడి కితాబు ఇస్తే, ఇలాంటి వ్యవస్థలను ఇతర రాష్ట్రాలు కూడా తమ రాష్ట్రాల్లో ప్రవేశపెడితే బాగుంటుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ అభిప్రాయ పడ్డారు. అలాగే సామాన్యులకు సైతం అత్యుత్తమ వైద్యసేవలు అందిస్తూ ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని జేపీ నడ్డా ప్రశంసిస్తే, దిశా లాంటి చట్టాలు దేశానికి అవసరం అని మహారాష్ట్ర , డిల్లీ, కేరళ ప్రభుత్వాలు అభిప్రాయ పడ్డాయి.
ఇక తాజాగ సీఎం జగన్ పరిపాలన విధానం , ప్రజలకి అందిస్తున్న సంక్షేమాన్ని ప్రశంసిస్తూ తమిళనాడు రాజకీయ పార్టీ పీఎంకే చీఫ్ రాందాస్ ఆసక్తికర వాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలో ఉన్న పరిపాలనా లోపాలని ఎత్తి చూపుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలని కూడా నెరవేరుస్తున్నారని. 56 బీసీ కులాల కోసం సీఎం జగన్ ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేశారని,తమిళనాట మాత్రం బీసీ సంక్షేమ బోర్డు డిమాండును కనీసం పాలకులు పట్టించుకోలేదని ముఖ్యంగా తమిళనాట దశాబ్దాల కాలం నుండి వన్నియార్ కులానికి 20% రిజర్వేషన్లు కల్పించాలని పోరాడుతున్న ఇక్కడ పాలకులు పట్టించుకునే స్థితిలో లేరని, కానీ ఆంధ్రప్రదేశ్ లో జగన్ తమిళనాడు సరిహద్దులో గల చిత్తూరు, నగరి, కుప్పం ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న వీరికి కార్పొరేషన్ ఏర్పాటు చేశారని ఇక్కడి ప్రభుత్వం ప్రజలను మాటలతో మొసం చేస్తుందని దుయ్యబట్టారు. ఏది ఏమైనా జగన్ పాలనలో సంస్కరణలకు ఏపీ కేంద్ర నిలయంగా మారి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడం సంతోషించదగ్గ విషయమే.