iDreamPost
android-app
ios-app

తమిళనాడులో ఘోర ప్రమాదం – పేలిన బాయిలర్

తమిళనాడులో ఘోర ప్రమాదం – పేలిన బాయిలర్

ఆరుగురు మృతి – 17 మందికి తీవ్ర గాయాలు

తమిళనాడులోని కడలూరు జిల్లా ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ థర్మల్ ప్లాంట్‌ యూనిట్ 5 లో బాయిలర్ పేలడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా గాయపడిన వారిని తిరుచ్చిలో ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు.

గతంలోనూ ఇదే ప్లాంట్ లో పేలిన బాయిలర్

కాగా గత ఏప్రిల్ నెలలో ఇదే ప్లాంట్ లో ప్రమాదం జరగడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కార్మికులు పని ప్రారంభించే సమయంలో బాయిలర్ పేలినట్లు తెలుస్తుంది. గతంలో ప్రమాదం జరిగినప్పుడే సరైన జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్ఎల్‌సీ యాజమాన్యానికి ప్రభుత్వం తెలిపింది. కానీ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.

కేంద్ర హోం శాఖ తమిళనాడులో జరిగిన ప్రమాదంపై విచారం వ్యక్తం చేసింది. ఇదే ప్లాంట్ లో కొన్ని నెలల క్రితం ఇదే తరహా ప్రమాదం జరగడం వల్ల ఈ ప్రమాద ఘటనపై అధ్యయనం చేయడానికి కేంద్ర బృందం రానున్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్లాంట్ లో చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. కడలూరు ఎస్పీ శ్రీ అభినవ్ కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు.