iDreamPost
android-app
ios-app

కరోనాతో తమిళనాడు ఎంపీ కన్నుమూత

కరోనాతో తమిళనాడు ఎంపీ కన్నుమూత

తమిళనాడులోని కన్యాకుమారి ఎంపీ హెచ్. వసంతకుమార్(70) కరోనా కారణంగా కన్నుమూశారు. ఆగస్టు 10న కరోనా చికిత్స కోసం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. కాగా కరోనా కారణంగా ఆయన ఆరోగ్యం విషమించడంతో ఎంపీని కాపాడటానికి డాక్టర్లు చేసిన యత్నాలు ఫలించలేదు. దీంతో వసంత్‌కుమార్‌ మృతి పట్ల కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.

వసంత్ కుమార్ ప్రస్తుతం తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కుమారి అనంతన్‌కు వసంతకుమార్ సోదరుడు.ప్రస్తుత తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్ రాజన్‌కు వసంత్ కుమార్ బాబాయి అవుతారు.

గతంలో తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండుసార్లు ఎమ్మెలేగా పనిచేశారు. 2006,2016 సంవత్సరాల్లో నంగునేరి అసెంబ్లీ నియోజవకర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.ఎమ్మెల్యేగా కొనసాగుతుండగానే 2019 లోక్‌సభ ఎన్నికల్లో కన్యాకుమారి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున అప్పటి కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్‌ మీద భారీ మెజారిటీతో విజయం సాధించడంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అప్పటినుండి ఎంపీగా కొనసాగుతున్నారు.

వసంత్ కుమార్ మృతిపట్ల తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం,డీఎంకే ప్రతిపక్ష నేత స్టాలిన్ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వసంతకుమార్ మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.