iDreamPost
iDreamPost
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ట్రెండ్ సెట్టర్ గా మారుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ తీసుకున్న పలు నిర్ణయాలు దేశంలోని అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయి. ఇప్పటికే జగన్ తీసుకున్న దిశాచట్టాని ఆదర్శంగా తీసుకుని మహరాష్ట్ర లాంటి రాష్ట్రాలు వాటిని అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు . మరో పక్క కరోనా కట్టడికి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్న హౌస్ హోల్డ్ స్క్రీనింగ్ విధానాన్ని డిల్లీ ప్రభుత్వం అనుసరించింది. అలాగే సెల్ టవర్ సిగ్నల్ , సెల్ ఫోన్ డేటా ఆదారంగా కరోనా పాజిటీవ్ కేసుల ప్రైమరీ కాంటాక్టులని కనుగొనటానికి జగన్ ప్రభుత్వం అనుసరించిన విధానాన్నే తెలంగాణ బీహార్ రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయి. అదే విదంగా రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ని సైతం కేరళ రాష్ట్రం అమలు చేసేందుకు ముందుకు వచ్చింది.
ఇది ఇలా ఉంటే తాజాగా జగన్ తీసుకున్న మరో నిర్ణయాన్ని తమిళనాడు రాష్ట్రం అమలు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆరోగ్య అవసరాలు తీర్చడం కోసం జులై నెలలో ముఖ్యమంత్రి జగన్ సాంకేతిగంగా అత్యుత్తమ సేవలు అందించగల 108, 104 అంబులెన్సులని ఒకేసారి వేయికి పైగా ప్రవేశ పెట్టి, వాటిని విజయవాడలో లాంచ్ చేసి, ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వాలు ఎంత చిత్తశుద్దితో ఉండాలో చాటి చెప్పి, యావత్ దేశం మొత్తం రాష్ట్రం వైపు తిరిగి చూసేలా చేశారు.
జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్పూర్తిగా తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం కూడా కరోనా సేవలను మరింత విస్తృతం చేయడమే లక్ష్యంగా ఒకేసారి 118 అంబులెన్సులను ప్రారంభించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి జెండా ఊపి అంబులెన్స్ సేవను ప్రారంభించారు. అంతేకాకుండా తమిళనాడు రాష్ట్రంలోనే తొలిసారిగా అంబులెన్స్ డ్రైవర్ గా వీర లక్ష్మీ అనే మహిళని నియమించి ఆదర్శంగా నిలిచారు. ఏది ఏమైనా తొలిసారి ముఖ్యమంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్న జగన్ తీసుకుంటున్న పలు నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలుస్తూ ఉండటం. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలను దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా గమినిస్తూ ఉండటం చూస్తే, పాలనా పరంగా రాష్ట్ర ప్రభుత్వ సాధించిన విజయంగా చెప్పవచ్చు.