iDreamPost
iDreamPost
నిన్న రాత్రి కొత్త సంవత్సరం సంబరాలు చేసుకుని బాగా నిద్రపోయి ఉదయాన్నే లేచిన సినిమా ప్రేమికులకు గట్టి షాకే తగిలేలా ఉంది. ఆర్ఆర్ఆర్ వాయిదా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని మధ్యాన్నం లోపు లేదా రేపు ప్రకటన వచ్చే అవకాశం ఉందనే వార్త విపరీతంగా వైరల్ కావడంతో చరణ్ తారక్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఒకపక్క డీల్స్ అన్నీ పూర్తవుతున్న తరుణంలో ఇలా జరగడం ఏమిటని దానికి కారణాలు వెతుకుతున్నారు. ఇప్పటిదాకా తెలుగులో ఏ సినిమాకూ చేయనంత భారీ ప్రమోషన్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ కు చేసుకుంటూ వచ్చారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో తప్ప అన్ని చోట్ల అన్ని భాషల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు గ్రాండ్ గా పూర్తయ్యాయి.
తీరా చూస్తే ఇప్పుడు పోస్ట్ పోన్ అనే షాక్. అమెరికాలో ఓమిక్రాన్ కేసులు చాలా దారుణంగా పెరుగుతున్నాయి. లక్షల్లో పెద్దలు పిల్లలు దీని బారిన పడుతున్నారు. అక్కడ అడ్వాన్ బుకింగ్స్ బాగానే ఉన్నప్పటికీ నేరుగా థియేటర్ కు వచ్చి టికెట్లు కొనే ఆడియన్స్ గణనీయంగా తగ్గిపోతారని డిస్ట్రిబ్యూటర్లు చెప్పారట. అక్కడే కాదు మరికొన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు తమిళనాడులో ఈ వైరస్ బారిన పడుతున్న కౌంట్ అంతకంతకు పెరుగుతోంది. దెబ్బకు 50 శాతం ఆక్యుపెన్సీని ఇవాళ్టి నుంచే అమలులోకి తెచ్చారు. మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, బీహార్ తదితర చోట్ల కూడా సగం సీట్లే ఉన్నాయి.
ఏపీ తెలంగాణలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. దానికి తోడు ఆంధ్రలో టికెట్ రేట్ ఇష్యూ వల్ల బయ్యర్లు రిబేట్లు అడుగుతున్నారు. దానికి నిర్మాత దానయ్య ఒప్పుకున్నా కూడా ఇప్పుడీ పరిణామాలు అయోమయంలోకి నెడుతున్నాయి. దానికి బదులు వేసవికి వాయిదా వేసి దేశమంతా వంద శాతం సీటింగ్, కరోనా భయాలు తొలగిపోవడం లాంటి ప్రయోజనాలు పొందే ఆలోచనలో ఉందట. ఇవేవి పట్టించుకోకుండా ఆర్ఆర్ఆర్ ని 7కే రిలీజ్ చేస్తే రావాల్సిన రెవిన్యూలో 200 కోట్ల దాకా కోత పడొచ్చని అంటున్నారు. మరి ఈ వాయిదా వార్త నిజమేనా అంటే దాదాపు ఔననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. చూద్దాం
Also Read : Liger : “లైగర్” థండర్ పంచ్ అదిరిపోయిందిగా!