రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తహశీల్దార్ విజయరెడ్డి తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందారు. ఆమెకు కాపాడాటానికి ప్రయత్నించిన పలువురు కూడా గాయాల పాలయ్యారు. కార్యాలయంలో ఆమె విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే ఈ దారుణమైన ఘటన చోటుచేసుకోవడం సంచలనం రేపింది. తొలుత తహశీల్దార్‌తో మాట్లాడటానికి లోపలికి వెళ్లిన దుండుగుడు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తరవాత అతను కూడా కిరోసిన్ పోసుకుని నిప్పంటిసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.దాదాపు 30 నిమీసాల పాటు విజయ మంటలో కాలుతూ ఉంది. పాస్ బుక్ కోసం కొన్ని రోజులుగా అతను కార్యాలయానికి వస్తున్నట్లు పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు.