iDreamPost
android-app
ios-app

వ్యాపారస్తులు కైలాస దేశానికి వచ్చేయండి – నిత్యానంద

వ్యాపారస్తులు కైలాస దేశానికి వచ్చేయండి – నిత్యానంద

అనేక ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన నిత్యానంద ఒక ప్రత్యేక దీవిని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దానికి కైలాస అని పేరు పెట్టి పాస్పోర్ట్,వీసా,జాతీయ జెండా, జాతీయ చిహ్నం ఏర్పాటు చేశారు. ఇటీవల రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు చేసి వినాయక చవితి రోజున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాసను ప్రారంభించి కైలాస డాలర్(బంగారు నాణేలు)ను విడుదల చేసారు.

తాజాగా వ్యాపారం చేసుకునేవారికి కైలాస దేశం ఎప్పుడూ స్వాగతం పలుకుతుందని నిత్యానంద తెలిపారు. కాగా తమిళనాడులోని మధురై జిల్లాకు చెందిన టెంపుల్ సిటీ హోటల్స్ అధినేత కుమార్ మరియు శారదా షాపింగ్ మాల్స్ అధినేత ప్రకాష్ తమ వ్యాపారాలను కైలాస దేశంలో ప్రారంభించేందుకు అవకాశం ఇవ్వాలని స్వామి నిత్యానందకు లేఖ రాసారు. దాంతో నిత్యానంద పైవిధంగా వ్యాఖ్యాలు చేశారు.

కైలాస దేశంలో వ్యాపారం చేయాలనుకునేవారికి తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని, కైలాస దేశం వ్యాపారస్తులకి ఎప్పుడూ స్వాగతం పలుకుతుందని స్వామి నిత్యానంద వెల్లడించారు. కానీ నిత్యానంద ప్రాంతీయ అభిమానం చూపిస్తూ తమిళనాడులోని మధురై, కాంచిపురం, తిరువన్నామలై జిల్లా వాసులకు తమ దేశంలో వ్యాపారం చేసుకోవడానికి తొలి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.

అసలు నిత్యానంద ఎక్కడ ఉన్నాడో తెలియక ఇంటర్ పోల్ అధికారులు సైతం తలలు పట్టుకుంటుంటే నిత్యానంద మాత్రం రోజుకో ప్రకటన చేస్తూ అందరికీ షాక్ ఇస్తున్నాడు. ఒకవేళ కైలాస దేశంలో వ్యాపారం చేయాలనుకునే వ్యాపారస్తులను ఫాలో చేస్తే నిత్యానంద దొరుకుతాడేమో వేచి చూడాలి.