Idream media
Idream media
తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్న భక్తి ఛానల్ చైర్మన్ పదవి నుంచి వివాదాస్పదంగా నిష్క్రమించిన పృథ్వి రాజ్ స్థానంలో ఎవరు నియమితులవుతారన్నదనిమీద అప్పుడే ఎవరి అంచనాలు వారు వేస్తున్నారు. టీవీ యాంకర్ స్వప్న ఆ పదవిలోకి వెళ్తారని అనుకుంటున్నారు.
ప్రస్తుతం స్వప్న భక్తి ఛానల్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆమెకు టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దృష్టిలో మంచి మార్కులే ఉన్నాయి. అన్నిటికి మించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి తో స్వప్నకు సాన్నిహిత్యం ఉందని, అది స్వప్నకు చైర్మన్ పదవికి మార్గం సుగమం చేస్తుందని అంటున్నారు.