iDreamPost
android-app
ios-app

ముందడుగు వేయబోతున్న సూర్య

  • Published Aug 11, 2020 | 9:58 AM Updated Updated Aug 11, 2020 | 9:58 AM
ముందడుగు వేయబోతున్న సూర్య

వచ్చే నెల థియేటర్లు తెరిచినా తెరవకపోయినా ఇప్పట్లో హౌస్ ఫుల్ బోర్డులు చూడటం జరగని పని. స్టార్ హీరోల సినిమాలకు పెట్టుబడులు సేఫ్ గా వెనక్కు రావాలంటే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా హాళ్లు నడిస్తే సాధ్యం కాదు. అందుకే నాని వి, రామ్ రెడ్ లు దసరాను కూడా పరిగణించడం లేదట. డిసెంబర్ లో ప్లాన్ చేసుకునే ఆలోచనలో ఉన్నారు. రవితేజ క్రాక్ ది అదే దారి. తమిళ్ లో కూడా పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. విజయ్ మాస్టర్ తో మొదలుకుని చాలా సినిమాలు ల్యాబుల నుంచి బయటికి వచ్చేందుకు ఎదురు చూపులు చూస్తున్నాయి. ఇదిలా ఉండగా సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ఆకాశమే నీ హద్దురా తమిళ వెర్షన్ సెన్సార్ ఫార్మాలిటీని పూర్తి చేసుకుంది.

దీంతో ఇది ఓటిటి రిలీజ్ కోసమేననే టాక్ చెన్నైలో ఊపందుకుంది. ఎయిర్ డెక్కన్ అధినేత గోపీనాథ్ బయోపిక్ గా రూపొందిన ఈ మూవీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ఒక కీలక పాత్ర చేశారు. ట్రైలర్ వచ్చాక అంచనాలు బాగా ఏర్పడ్డాయి. అయితే ఏప్రిల్ లో ప్లాన్ చేసుకున్న విడుదల లాక్ డౌన్ ఏకంగా ఐదు నెలలుగా వాయిదా పడుతూనే వచ్చింది. అందుకే సూర్య డిజిటల్ మార్గం గురించి సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఆ మధ్య తన భార్య జ్యోతిక నటించిన పోన్మగల్ వందాల్ ని డిస్ట్రిబ్యూటర్లు ఎంత బెదిరించినా సరే ప్రైమ్ ద్వారా విడుదల చేసిన సంగతి తెలిసిందే. హక్కుల రూపంలో నిర్మాతగా సూర్య చాలా సేఫ్ అయ్యాడు.

మూవీ కూడా కోట్లాది మందికి రీచ్ అయ్యింది. థియేటర్లలో అయితే అది అంతగా ఆడేది కాదన్నది వాస్తవం. అయితే ఆకాశం నీ హద్దురా మీద మంచి హైప్ ఉంది కాబట్టి దాన్ని క్యాష్ చేసుకునే దిశగా స్ట్రీమింగ్ సంస్థలు భారీ ఆఫర్లతో ఊరిస్తున్నాయి. ముందు సెన్సార్ చేయించి పెట్టుకుంటే ఉభయకుశలోపరిగా ఉండటంతో పాటు శాటిలైట్ కూడా మంచి డీల్ దక్కించుకోవచ్చు. ఇవన్ని ఆలోచించే సూర్య పక్కా ప్లానింగ్ తో ఉన్నాడట. ఒకవేళ థియేటర్స్ లో అనుకున్నా ఇంకో మూడు నెలలు ఎదురు చూడాలి. దాని కన్నా ఓటిటి రూటే మేలనుకున్నా ఆశ్చర్యం లేదు. వెంకటేష్ గురు ద్వారా మనకూ పరిచయమున్న సుధా కొంగరకు ఇది పూర్తి కాకుండానే మంచి డిమాండ్ ఏర్పడింది