నిర్భయ నిందితుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష రివ్యూ పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. నిర్భయ కేసులో నలుగురు నిందితులకు ఉరి శిక్ష సరైనదే అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. గతంలో ముగ్గురి నిందితుల రివ్యూ పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. కాగా రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ కోసం 3 వారాలు గడువు ఇవ్వాల్సిందిగా నిందితుడి తరపు లాయర్ సుప్రీం కోర్టును కోరారు. రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ కోసం ఒక వారం గడువు చాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
నిర్భయ కేసులో రివ్యూ పిటిషన్లకు అవకాశమే లేదని సుప్రీంకోర్టు తెలిపింది. రాష్ట్రపతి క్షమాభిక్షకు అక్షయ్ సింగ్ పిటిషన్ పెట్టుకున్న అనంతరం నిర్భయ దోషుల ఉరిపై స్పష్టత వస్తుంది.