ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ముంబయ్ ఇండియన్స్ జట్టును చిత్తు చేసిన వార్నర్ సేన ప్రస్తుతం ఆ గెలుపును ఆస్వాదిస్తున్నారు.ముంబయ్ జట్టును ఓడించడం ద్వారా పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది సన్‌రైజర్స్ టీం. ప్రస్తుతం విజయాన్ని ఆస్వాదిస్తున్న ఆరెంజ్ ఆర్మీ టాలీవుడ్‌లో సెన్సేషన్ హిట్ సాధించి ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన ‘బుట్ట బొమ్మ’ పాటకు కాలు కదిపారు. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా గతంలో డేవిడ్ వార్నర్ తన డాన్సులతో టిక్ టాక్ ద్వారా అభిమానులను అలరించిన విషయం తెలిసిందే. ఇంతకుముందు టిక్‌టాక్‌లో వార్నర్ తన భార్యతో కలిసి బుట్ట బొమ్మ పాటకు డాన్స్ వేశారు. అయితే తాజా ఐపిఎల్ ఫలితాలతో సంబంధం లేకుండా ఫ్రాంచైజీ యజమానులు తమ జట్టుకు అండగా నిలవడం వల్లనే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తెలిపాడు