iDreamPost
android-app
ios-app

సునీల్ హీరోగా సూపర్ హిట్ రీమేక్

  • Published Nov 09, 2020 | 7:16 AM Updated Updated Nov 09, 2020 | 7:16 AM
సునీల్ హీరోగా సూపర్ హిట్ రీమేక్

ఇటీవలే ఓటిటిలో విడుదలైన కలర్ ఫోటోలో నెగటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలోనూ మెప్పించిన సునీల్ గత కొంత కాలంగా క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరోగా వరస పరాజయాలు పలకరించడంతో పాటు వాటి ఫలితాలు మార్కెట్ మీద ప్రభావం చూపించడంతో కొంత గ్యాప్ తీసుకున్నాడు. తాజాగా మళ్ళీ మరోసారి కథానాయకుడిగా మారబోతున్నట్టు సమాచారం. అయితే స్ట్రెయిట్ సబ్జెక్టు కాకుండా రిస్క్ తగ్గించుకోవడానికి రీమేక్ కథను ఎంచుకున్నట్టు తెలిసింది. కన్నడలో గత ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన బెల్ బాటమ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. జయాతీర్థ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ పాతిక పైగా కేంద్రాల్లో వంద రోజులు ఆడటం ఒక రికార్డు.

ఎలాంటి స్టార్లు లేకుండా రిషబ్ శెట్టి హీరోగా రూపొందిన బెల్ బాటమ్ ఒక ఎంటర్ టైనింగ్ క్రైమ్ థ్రిల్లర్. డిటెక్టివ్ కావాలని కలలు కనే హీరో తండ్రి ఒత్తిడి వల్ల సాధారణ కానిస్టేబుల్ గా మారతాడు. అయితే అనుకోకుండా ఇంట్రెస్టింగ్ దొంగతనం కేసు ఒకటి తగులుతుంది. దీని వెనుక ఎవరున్నారో పసిగట్టే బాధ్యతను తీసుకున్న ఇతగాడికి ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. అవేంటి అతను చివరికి అసలు నేరస్థులను ఎలా పట్టుకున్నాడు అనేదే కథ. హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడిన బెల్ బాటమ్ ని రీమేక్ చేయాలనీ ఎందరో ప్రయత్నించినప్పటికీ అతడే శ్రీమన్నారాయణ హీరో రక్షిత్ శెట్టి రీమేక్ హక్కులు సొంతం చేసున్నట్టు టాక్.

ఇదే కథకు కొన్ని కీలకమైన మార్పులు చేసి అక్షయ్ కుమార్ ఇప్పటికే విదేశాల్లో దీని షూటింగ్ పూర్తి చేశాడు. వచ్చే ఏప్రిల్ లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ తెలుగులో మాత్రం ఒరిజినల్ వెర్షన్ కు కట్టుబడి పూర్తిగా అదే బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తారట. అయితే దర్శకుడు ఎవరు హీరోయిన్ గా ఎవరు చేస్తారు లాంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సునీల్ కనక దీంతో మళ్ళీ హిట్టు కొడితే హీరోగా కొనసాగే ఛాన్స్ ఉంది. అసలే తన క్యాలిబర్ కు తగ్గట్టు పాత్రలు దొరకడం లేదు. తన ఒరిజినల్ టైమింగ్ ని చూసి చాలా కాలమయ్యింది. మరి ఈ బెల్ బాటమ్ అయినా ఆ లోటు తీరుస్తుందేమో చూడాలి