iDreamPost
iDreamPost
యథావిధిగా బిగ్ బాస్ 4 వీకెండ్ షో నాగార్జున ఎనర్జీతో సందడిగా ముగిసింది. వీలైనంత రేటింగ్స్ ఎక్కువగా వచ్చే ఎపిసోడ్స్ శని ఆదివారాలే కాబట్టి దానికి తగ్గట్టే స్క్రిప్ట్ ని పక్కాగా రూపొందిస్తున్నారు. ఇక మూడు రోజుల నుంచి సోషల్ మీడియా ప్రచారంలో ఉన్నట్టుగానే కరాటే కళ్యాణి ఎలిమినేట్ అయ్యారు. పనిలో పనిగా తనతో హరికథ కూడా చెప్పించేశారు. వెళ్లే ముందు హౌస్ లో టాప్ 5 అండ్ లో 5 పార్టిసిపెంట్స్ ఎవరో చెప్పమని అడిగిన ప్రశ్నకు కళ్యాణి సమాధానమిస్తూ దివి, హారిక, అమ్మ రాజశేఖర్, అభిజీత్ మోనాల్ లను పాజిటివ్ క్యాటగిరీలో పెట్టేసింది. కింది నుంచి ఐదు పేర్లు చెబుతూ గంగవ్వ, సోహైల్, సుజాతా, కుమార్ సాయి, అరియనాలను పేర్కొంది.
మొత్తానికి అరుపులు, కేకలు, ఏడుపులు, డామినేషన్లతో ఆధిపత్యం చేయాలనీ చూసిన కళ్యాణికి ప్రేక్షకులు సైతం తక్కువ ఓట్లతో గుడ్ బై చెప్పేశారు. ఎప్పటిలాగే తను వెళ్లే విషయంలో కొంత డ్రామా నడిచింది. దేత్తడి హారికను కూడా ఎలిమినేట్ చేసినట్టు నాగార్జున చెప్పారు. లగేజీ అంతా సర్దుకుని ఎమోషనల్ గా బయటికి వెళ్ళబోతున్న తరుణంలో ఇది ఫేక్ అని, సెల్ఫ్ నామినేట్ చేసుకుంటున్న వాళ్ళకు ఒక హెచ్చరికగా ఇది చేసినట్టు చెప్పడంతో హారిక ఫ్యాన్స్ హమ్మయ్య అనుకున్నారు. వచ్చే వారం ఎలిమినేషన్ కి ఒకరిని నామినేట్ చేయమని కళ్యాణిని నాగార్జున కోరగా దేవి నాగవల్లిని ఎంపిక చేయడం మరో ట్విస్ట్. సభ్యుల్లోని చెరో ఇద్దరినీ టీమ్ గా చేసి మ్యూజికల్ చైర్స్ ఆడించడం బాగా ఎంటర్ టైన్ చేసింది.
అందులో గెలవాలని ఎవరికి వాళ్ళు గట్టిగా ప్రయత్నించడం సరదాగా సాగింది. ఇక నాగార్జున గంగవ్వను గంగమ్మ అని పిలవడం మొదలుపెట్టారు. వయసులో కేవలం రెండు మూడేళ్లు వ్యత్యాసం ఉన్న నాగ్ ఆమెను అవ్వ అని పిలవడం పట్ల ఆన్ లైన్ లో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. అది దృష్టిలోకి వచ్చిందో ఏమో మరి మొత్తానికి పిలుపు అయితే మారింది. ఇప్పటిదాకా సూర్య కిరణ్, కళ్యాణి ఇద్దరూ హౌస్ నుంచి బయటికి వచ్చారు. ఇక రేపటి నుంచి కళ్యాణి ఇంటర్వ్యూలతో యుట్యూబ్ ఛానల్స్ హోరెత్తిపోతాయి. వీటి కన్నా ముందు స్టార్ మా అఫీషియల్ గా రాహుల్ సింప్లిగంజ్ తో చేయిస్తున్న ముఖాముఖీలో ఆవిడ పాల్గొంటారు. హౌస్ లోపల ఉన్నప్పటి విషయాలతో తమ పర్సనల్ సంగతులు కూడా ఎన్నో పంచుకుంటున్న ఈ ప్రోగ్రాం వల్ల బిగ్ బాస్ గురించి జనం గట్టిగానే తెలుసుకుంటున్నారు