iDreamPost
android-app
ios-app

ముగింపు లేని సూర్యవంశీ కథ

  • Published Mar 10, 2021 | 10:06 AM Updated Updated Mar 10, 2021 | 10:06 AM
ముగింపు లేని సూర్యవంశీ కథ

లాక్ డౌన్ ఎపుడో అయిపోయింది. జన జీవనం సాధారణం అయిపోయింది. అన్ని భాషలలో కంటే ముందుగా తెలుగు పరిశ్రమ కోలుకుని వరసగా ప్రేక్షకులు ఏదీ చూడాలో అర్థంకాక ఉక్కిరి బిక్కిరి అయ్యే స్థాయిలో సినిమాలు విడుదల చేస్తూనే ఉంది. మనల్ని స్ఫూర్తిగా తీసుకుని ఇప్పుడిప్పుడే కోలీవుడ్ శాండల్ వుడ్ లు స్పీడ్ పెంచాయి. ఒక్క తెలుగులోనే ఈ రెండున్నర నెలల కాలంలో అరవై దాకా కొత్త సినిమాలు వచ్చాయంటే ఆశ్చర్యం కలిగించినా ఇది నిజం. రాబోయే రోజుల్లో ఈ కౌంట్ భారీగా పెరగబోతోంది. గత ఏడాది ఏర్పడిన తొమ్మిది నెలల శూన్యాన్ని పూడ్చుకునేలా మన హీరోలు దర్శకులు నిర్మాతలు అందరూ నడుం బిగించి పని చేస్తున్నారు.

ఇక్కడ ఎంత కదలిక ఉన్నా బాలీవుడ్ మాత్రం అంత దూకుడు చూపించడం లేదు. చిన్న మరియు మీడియం రేంజ్ సినిమాలు డేట్లు చెప్పేసుకున్నాయి కానీ స్టార్ హీరోలు ఇంకా మీనమేషాలు లెక్కబెడుతూనే ఉన్నారు. తాజాగా సూర్యవంశీ వ్యవహారం ఇంకా తేలడమే లేదు. మొన్నటి దాకా ఏప్రిల్ 2 అని గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఆ మేరకు డిస్ట్రిబ్యూటర్లకు ఓ మాట కూడా ముందే చెప్పి పెట్టారు. మల్టీ ప్లెక్సు యాజమాన్యాలతో ఏదో పేచీ వస్తే దాన్ని కూడా పరిష్కరించుకునే దిశగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈలోగా సీన్ మళ్ళీ మొదటికే వచ్చింది. సూర్యవంశీకి మరోసారి బ్రేక్ వేశారు. ఇప్పుడు ఏప్రిల్ 2 కూడా రావడం లేదని ముంబై టాక్.

మల్టీ స్టారర్ గా రూపొందిన ఈ మల్టీ స్టారర్ మూవీలో అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, రన్వీర్ సింగ్ హీరోలుగా నటించారు. పోలీస్ కాప్ కం యాక్షన్ కామెడీ స్పెషలిస్ట్ రోహిత్ శెట్టి దర్శకుడు. అందుకే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ట్రైలర్ కూడా ఆసక్తిని విపరీతంగా పెంచింది. సుమారు రెండు వందల కోట్ల దాకా దీని మీద బిజినెస్ ని నిర్మాతలు ఆశిస్తున్నారు. అయితే మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్ళీ వెలుగులోకి రావడంతో సూర్యవంశీ ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. భారీ డిజిటల్ డీల్స్ వచ్చినా కూడా టెంప్ట్ కాకుండా వేచి చూస్తున్న ప్రొడ్యూసర్లకు దానికి తగ్గ ఫలితం ఎప్పుడు వస్తుందో