Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్, పంచాయతీరాజ్ స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం రానున్న జనవరిలో ఎన్నికలు నిర్వహించనుంది. ఈ మేరకు సీఎం జగన్ మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు సంకేతాలు ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. మొదట పట్టణ సంస్థలకు ఎన్నికలు జరిపి ఆ తర్వాత పంచాయతీలకు నిర్వహించనునున్నట్లు సమాచారం.
పంచాయతీ పాలక వర్గాల గడువు గత ఏడాది 2018 ఆగస్టు లోనే ముగిసింది. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదు. అప్పటి నుంచి పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలోనే సాగుతున్నాయి. పాలక మండళ్లు లేనందువల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులు పంచాయతీలు కోల్పోయాయి. ప్రజా వ్యతిరేకత ను దృష్టి లో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలపై ఆ ప్రభావం ఉంటుందని అప్పటి సీఎం చంద్రబాబు పంచాయతీ ఎన్నికలు జరపలేదన్న విమర్శలున్నాయి. కాగా, మున్సిపాలిటీల పాలక మండళ్ల గడువు ఈ ఏడాది జూన్ – జులై తో ముగిసింది. ప్రస్తుతం పట్టణ సంస్థలు కూడా ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి.
ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు లో పిటిషన్ దాఖలయ్యాయి. ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలంటూ పిటిషన్లలో కోరారు. విచారించిన న్యాయస్థానం మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సీఎం జగన్ నేరుగా ఈ అంశం పై స్పష్టత ఇవ్వడం తో స్థానిక సమరానికి కౌంట్ డౌన్ మొదలైంది.