iDreamPost
android-app
ios-app

మహేష్ 28 కోసం కీలక మార్పులు

  • Published Nov 26, 2022 | 5:10 PM Updated Updated Nov 26, 2022 | 5:10 PM
మహేష్ 28 కోసం కీలక మార్పులు

సూపర్ స్టార్ కృష్ణ గారి అకాల మరణంతో మళ్ళీ షూటింగ్ వాయిదా పడ్డ మహేష్ బాబు త్రివిక్రమ్ ల కాంబినేషన్ ప్రాజెక్టులో పలు మార్పులు జరిగినట్టు సమాచారం. ముందు రాసుకున్న యాక్షన్ ఎంటర్ టైనర్ స్థానంలో ఇప్పుడు ఫ్యామిలీ కం ఎమోషన్స్ తో వినోదాత్మక చిత్రాన్ని ప్లాన్ చేశారట. తక్కువ టైంలోనూ మంచి స్క్రిప్ట్ సిద్ధమయ్యింది వినికిడి. ఏ జానర్ లో సాగుతుందనే క్లారిటీ ఇంకా బయటికి రాలేదు కానీ మొత్తానికి చాలా ఆకర్షణలు సిద్ధమవుతున్నాయి. సంగీత దర్శకుడు తమన్ స్థానంలో అనిరుద్ రవిచందర్ ని తీసుకుంటారనే ప్రచారం జరిగింది కానీ అదంతా ఉత్తిదేనని తేలిపోయింది. దూకుడు రేంజ్ ఆల్బమ్ ని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు

ఇక పూజా హెగ్డే ఇందులో మెయిన్ హీరోయిన్ కాగా రెండో కథానాయికగా శ్రీలీలను లాక్ చేశారట. అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయడనికి ఇది సరైన సమయం కాదు కాబట్టి చిత్రీకరణ మొదలుపెట్టాక అనౌన్స్ చేస్తారు. అంతే కాదు అత్తారింటికి దారేది తర్వాత ఐటెం సాంగ్స్ స్పెషల్ పాటలు చేయని త్రివిక్రమ్ ఇందులో ఫామ్ లో ఉన్న స్టార్ హీరోయిన్ తో ప్రత్యేక గీతాన్ని పెట్టబోతున్నట్టు తెలిసింది. పేరు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. విడుదల ముందు చెప్పిన ఏప్రిల్ 28 జరగడం లేదు. 2023 దసరాని ప్రస్తుతానికి టార్గెట్ గా పెట్టుకుని ఒకవేళ అది సాధ్యం కాకపోతే దీపావళికి ప్లాన్ చేస్తారు. మరీ 2024 సంక్రాంతి దాకా వేచి చూసే అవసరం ఉండదు.

ప్రస్తుతానికి మహేష్ బాబు బయటికి వాళ్లకు అందుబాటులోకి రాలేదు. తండ్రి దూరం కావడం బాగా డిస్ట్రబ్ చేయడంతో ఫోన్ కాల్స్ అటెండ్ చేయడం లేని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో హిట్ 2 ప్రమోషన్స్ సందర్భంగా అడవి శేష్ చెప్పాడు. రేపు హైదరాబాద్ లో భారీ ఎత్తున జరగబోతున్న కృష్ణగారి పెద్ద కర్మ సభలో చాలా రోజుల తర్వాత మహేష్ అభిమానులతో మాట్లాడబోతున్నాడు.జెఆర్సి కన్వేషన్ లో జరిగే ఈ ఫంక్షన్ కు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున ఫ్యాన్స్ పాల్గొనబోతున్నాడు. డిసెంబర్ రెండో వారం నుంచి రెగ్యులర్ షూట్ ప్రారంభం అయ్యే అవకాశమున్న ఎస్ఎస్ఎంబి 28 అతడు ఖలేజాలను మించే సినిమాగా రావాలని మూవీ లవర్స్ ఆకాంక్ష

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/