iDreamPost
android-app
ios-app

ఇక ‘జాతీయం’లో శ్రీవారి సొమ్ము

ఇక ‘జాతీయం’లో శ్రీవారి సొమ్ము

తిరుమల శ్రీవారి సొమ్ము ఇక మరింత భద్రంగా ఉండనుంది. ఈ మేరకు టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సొమ్మును ఇకపై జాతీయ బ్యాంకుల్లోనే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలని నిర్ణయించింది. ప్రాంతీయ బ్యాంకుల్లో భద్రత లేని కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు త్వరలోనే రూ.1500 కోట్లు జాతీయ బ్యాంకులో డిపాజిట్‌ చేయాలని నిర్ణయించింది.

గత ప్రభుత్వంలో టీటీడీ సొమ్మును ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడంతో పలువురు భక్తులు కోర్టును ఆశ్రయించారు. రూ.1400 కోట్లను ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడంతో భక్తులు అభ్యంతరం తెలుపుతూ.. హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు సూచనల మేరకు జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్లు చేయాలని తెలిపింది. కాగా కానుకల రూపంలో టీటీడీకి ప్రతి ఏడాది పెద్ద ఎత్తను విరాళాలు అందుతున్న విషయం తెలిసిందే. అయితే వీటి భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రాతీయ, ప్రైవేటు బ్యాంకుల్లో ఇక మీదట డిపాజిట్‌ చేయవద్దని పాలకమండలి సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు.