iDreamPost
android-app
ios-app

శిల్పా హెచ్చరిక – నీ మత రాజకీయాలు ఇక్కడ చెల్లవు రాజా

శిల్పా హెచ్చరిక – నీ మత రాజకీయాలు ఇక్కడ చెల్లవు రాజా

జ్యోతిర్లింగం,శక్తిపీఠం ఉన్న ఏకైక పుణ్యక్షేత్రం శ్రీశైలం. రాయలసీమ,ఉమ్మడి ఆంధ్ర నుండే కాక దేశంలోని వివిధ ప్రాంతాల నుండి శివ భక్తులు అనునిత్యం ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ముఖ్యంగా తమ ఆడపడుచుగా పార్వతీ దేవిని కొలిచే కన్నడిగులు, మహారాష్ట్రీయులు అధిక సంఖ్యలో శ్రీశైలం దేవస్థానానికి వస్తుంటారు.

శ్రీశైలం డ్యామ్ నిర్మాణంలో భాగంగా సున్నిపెంటలో ఏర్పాటు చేసిన టౌన్ షిప్ లో అనేక ప్రాంతాల నుండి వచ్చి ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఇక్కడ కులాలు, మతాలకు అతీతంగా నివసించే ప్రజలంతా మత సామరస్యంతో, సోదర భావంతో కలిసి మెలసి జీవిస్తున్నారు.

కానీ దురదృష్టవశాత్తు గత కొంత కాలంగా శ్రీకాంత్ రెడ్డి అనే స్థానిక బీజేపీ నేత తన రాజకీయ ఎదుగుదలకు మతాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ నాయకుడు వ్యక్తిగత అజెండాతో బీజేపీలోని దూకుడు స్వభావం ఉన్న రాజా సింగ్ వంటి నేతలను ఇక్కడికి తీసుకువచ్చి శ్రీశైలం దేవస్థానం మీద అలాగే ఈ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మీద అర్థంలేని విమర్శలు చేయించడం పరిపాటిగా మారింది. తాజాగా నిన్న తెలంగాణాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దేవస్థానానికి చెందిన వందలాది ఆవులు చనిపోతున్నట్లు విమర్శలు చేశారు. అలాగే దేవస్థానానికి చెందిన షాపుల కాంట్రాక్ట్ రజాక్ అనే ముస్లిం వ్యక్తికి ఇచ్చారని కూడా ఆరోపణలు చేశారు.

2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా శ్రీశైలం నియోజకవర్గం ఏర్పడింది. అంతకుముందు ఆత్మకూరు నియోజకవర్గంలో భాగంగా శ్రీశైలం ఉండేది. శ్రీశైలం, మహానంది, కొలను భారతి వంటి పుణ్యక్షేత్రాలు ఉన్న శ్రీశైలం నియోజకవర్గంలో సంవత్సరం పొడుగునా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. శివరాత్రి మరియు ఉగాది పండగల సీజన్లో వేలాది మంది భక్తులు కాలినడకన, కనీసం చెప్పులు కూడా ధరించకుండా నడిచి శ్రీశైలానికి వెళుతుంటారు. దారి వెంట గ్రామ గ్రామాన భక్తులకు అన్నదానంలో పాటు కాళ్ళ నొప్పులకు మందులు పంచుతుంటారు. మతాలకు అతీతంగా అందరూ ఆ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అన్ని పార్టీల రాజకీయ నాయకులు కూడా అన్నదానం ,హెల్త్ క్యాంపు లు నిర్వహిస్తుంటారు.

పూర్వ ఆత్మకూరు నియోజకవర్గంలో బుడ్డా వెంగళరెడ్డి కుటుంబం ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వెంగళరెడ్డి, ఆయన కుమారులు సీతారామిరెడ్డి మరియు రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన బుడ్డా రాజశేఖర్ రెడ్డి టీడీపీలోకి ఫిరాయించాడు. నంద్యాల ఉప ఎన్నికల సందర్భములో శిల్పా చక్రపాణి రెడ్డి ఆరు సంవత్సరాల పదవీకాలం ఉన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరాడు. 2004 నుంచి ఆత్మకూరు, శ్రీశైలం ప్రాంతంలో సేవా కార్యక్రమాలతో ప్రజల్లో మంచిపేరు తెచ్చుకున్న శిల్పా చక్రపాణిరెడ్డి 2019లో వైసీపీ తరుపున శ్రీశైలం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

2019 ఎన్నికల్లో శ్రీశైలం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన బుడ్డా శ్రీకాంత్ రెడ్డి (బుడ్డా వెంగళ రెడ్డి తమ్ముడి కొడుకు) కేవలం 1184 ఓట్లు సాధించారు. శ్రీకాంత్ రెడ్డి కన్నా జనసేన, నోటా , కాంగ్రెస్ కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. శ్రీకాంత్ రెడ్డి ఓట్ల పరంగా ఆరో స్థానంలో నిలిచాడు. సొంత గ్రామంలో పాతిక ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఈ శ్రీకాంత్ రెడ్డి గత కొంత కాలంగా శ్రీశైలంలో ముస్లింలకు దేవస్థానం షాప్ లను కేటాయిస్తున్నారని, గోశాలలో ఆవులు చనిపోతున్నాయంటూ స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నారు. మతం ఆధారంగా రాజకీయంగా ఎదగాలన్న లక్ష్యంతో తెలంగాణాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ను కర్నూల్ జిల్లాలోని పుణ్యక్షేత్రాలు తిప్పి చక్రపాణి రెడ్డి మీద ఆరోపణలు చేపిస్తున్నాడు. రాజా సింగ్ కు స్థానిక పరిస్థితుల మీద అవగాహన లేదు, శ్రీకాంత్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదువుతూ సవాల్ విసురుతున్నాడు.

శ్రీశైలం ప్రాంతంలో కులాలకు, మతాలకు అతీతంగా దాదాపు ప్రతి ఇంటిలోను మల్లికార్జున స్వామి ఫోటోలు ఉండడం గమనించవచ్చు. దేవస్థానం మీద ఆధారపడి బతికే కుటుంబాలన్ని మల్లన్నకు మొక్కుకుంటాయి.. శ్రీశైలమే కాదు రాయలసీమలోని అన్ని పుణ్యక్షేత్రాలలో ముస్లింలు పూజలు చేయటం మొదటి నుంచి ఉంది. దేవుని గడపలోని వెంకటేశ్వర స్వామికి తొలి పూజలు ఇప్పటికీ ముస్లింలే చేస్తారు.

ఈ కొత్త బీజేపీ నాయుడు శ్రీకాంత్ రెడ్డి కేవలం రాజకీయ అజెండాతోనే శ్రీశైలం దేవస్థానం మీద శిల్పా చక్రపాణి రెడ్డి మీద మతపరమైన ఆరోణలు చేస్తున్నాడు. శ్రీకాంత్ రెడ్డి ఆరోపణలు చేసిన రజాక్ అనే వ్యక్తి చిన్నతనంలోనే దాదాపు మూడుదశాబ్దాల కిందట శ్రీకాంత్ రెడ్డి పెదనాన్న బుద్ధా వెంగళ రెడ్డి ద్వారా శ్రీశైలం దేవస్థానంలో పనిచేయటం ప్రారంభించాడు. రజాక్ ఒక బ్రాహ్మణ స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులు తెలియని వారు శ్రీశైలంలో ఎవరూ ఉండరు. రజాక్ శ్రీమతి అయినా బ్రాహ్మణ స్త్రీ గత కొంత కాలంగా గోశాల బాధ్యతలు చూస్తున్నారు. రజాక్ మతం ఆధారంగా ఆరోపణలు చేస్తున్న శ్రీకాంత్ రెడ్డి ఆయన గతం గురించి , భార్య మతం గురించి , బుడ్డా వెంగళరెడ్డి హయాంలోనే ఆయన ద్వారానే ఉపాధి పొందిన విషయాల గురించి మాత్రం ప్రసావించకపోవటం గమనార్హం.

అప్పటి వరకు శిల్పా చక్రపాణి రెడ్డిలో చూడని మత కోణం బీజేపీలు చేరటంతో శ్రీకాంత్ రెడ్డికి ఇప్పుడు కనిపిస్తునట్లుంది. విశ్వహిందూ పరిషత్తు కోసం, హైద్రబాద్ గణేష్ నిమజ్జన సంఘం కోసం ఆస్తులు అమ్ముకున్న కర్నూల్ జిల్లాకే చెందిన పుల్లారెడ్డి స్వీట్స్ పుల్లారెడ్డికి కానీ ఆయన కుమారుడికి కానీ ,కపిలేశ్వరయ్య లాంటి కర్నూల్ జిల్లా సీనియర్ బీజేపీ నేతలకు ఎవరు చేయని ఆరోపణలు శ్రీకాంత్ రెడ్డి ఎందుకు చేస్తున్నారో స్థానికుల అర్ధం చేసుకోగలరు. 2019 ఎన్నికలకు ముందు శ్రీకాంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు? రేపు 2024కు ఏపార్టీలో ఉంటాడు? మధ్యలో మతం పేరుతొ ప్రజలు ఆమధ్య చిచ్చుపెట్టే రాజకీయంతో ఏమీ సాధిస్తాదంటూ ఆప్రాంతానికి చెందిన కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

శిల్పా చక్రపాణి రెడ్డి హయాంలో శ్రీశైలం జరిగిన అభివృద్ధి పనులు ముఖ్యంగా రింగ్ రోడ్ ,మంచి వసతులతో కొత్త కాటేజీలు, భక్తుల సౌకర్యం కోసం వివిధ దర్శనాల ఏర్పాటు వంటి అంశాలతో భక్తుల సంఖ్య ,దేవస్థానం ఆదాయం పెరిగాయి. శ్రీకాంత్ రెడ్డి రాజకీయాల్లో కోసం శ్రీశైల దేవస్థానం మీద ఆరోపణలు మానుకొని చక్రపాణి రెడ్డి స్పందించినట్లు దేవస్థానం పెద్దలు మరియు పీఠాధిపతుల సమక్షంలో చర్చ జరపాలి ..