iDreamPost
iDreamPost
ఐపీఎల్ 2022లో బుధవారం రాత్రి కొత్త టీం గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఉత్కంఠపోరులో గుజరాత్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ టీం 20 ఓవర్లకి 195 రన్స్ కొట్టగా, గుజరాత్ టీం 20 ఓవర్లకి 199 రన్స్ తో విజయం సాధించింది. ఒక దశలో అందరూ హైదరాబాద్ గెలుస్తుందని అనుకున్నారు. చివరి ఓవర్లో గుజరాత్ విజయానికి 22 పరుగులు అవసరం. రషీద్, తెవాటియాలు బ్యాట్ లు ఝుళిపించి స్టేడియంలో విధ్వంసం సృష్టించారు.
రషీద్ ఖాన్ 11 బంతుల్లోనే 4 సిక్సర్లతో 31 పరుగులు చేసి అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. గత సీజన్ వరకు రషీద్ హైదరాబాద్ టీంలో ఆడాడు. నిన్న జరిగిన మ్యాచ్ లో రషీద్ ఆడిన విధానం చూసి హైదరాబాద్ మీద పగ తీర్చుకున్నాడు అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రషీద్ హైదరాబాద్ టీం మీద పగ తీర్చుకోవడం ఏంటి అనుకుంటున్నారా? ఇటీవల కొన్ని రోజుల క్రితం సన్ రైజర్స్ బ్యాటింగ్ కోచ్, వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా ,రషీద్ ఖాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
”అందరూ అనుకుంటున్నట్టు రషీద్ ఖాన్ పెద్ద టేకర్ ఏమీ కాదు. అతనికి మించిన బౌలర్లు ప్రస్తుతం సన్‌రైజర్స్‌లో చాలామందే ఉన్నారు. రషీద్ ఖాన్ లేకపోయినా మేము మ్యాచ్ లు గెలుస్తున్నాం” అని లారా కామెంట్ చేశారు. దానికి తగ్గట్టుగానే రషీద్ ఖాన్ బౌలింగ్ ను సన్ రైజర్స్ ఉతికి ఆరేసింది. అక్కడిదాకా లారా చెప్పినట్లే జరిగింది. ఆ తర్వాతే రషీద్ బ్యాటింగ్ స్టార్ట్ అయ్యింది. అతని సిక్సులు కొట్టిన తీరు చూస్తుంటే లారా అన్న వ్యాఖ్యలని సీరియస్ గా తీసుకొని ఆడినట్టు అనిపిస్తుంది. రషీద్ లారా వ్యాఖ్యలకి తన బ్యాటింగ్ తో సమాధానమిచ్చాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మ్యాచ్ గెలిచిన తర్వాత రషీద్ ఇచ్చిన హావభావాలు కూడా అలాగే ఉన్నాయంటూ, లారాకి రషీద్ తన ఆటతో కౌంటర్ ఇచ్చాడంటూ క్రికెట్ అభిమానులు అంటున్నారు.