ఇంకో 50 రోజుల్లో మూడేళ్ళ గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాను అభిమానులు వెండితెర మీద చూడబోతున్నారు. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన పింక్ రీమేక్ వకీల్ సాబ్ ఏప్రిల్ 9న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా మూవీకి సంబంధించిన అప్ డేట్స్ ఒక ఫ్లోలో రావడం లేదు. ఆ మధ్య ఓ చిన్న టీజర్ రిలీజ్ చేసి హడావిడి చేశారు కానీ మళ్ళీ అంతా గప్ చుప్. అంతో ఇంతో ట్విట్టర్ వేదికగా తమన్ దీనికి సంబంధించిన సమాచారాన్ని షేర్ చేసుకోవడం తప్ప యూనిట్ నుంచి పెద్దగా మూమెంట్ లేదు. ఇదే అభిమానులను అసహనానికి గురి చేస్తోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత పవన్ సినిమా అయినా సరే ప్రమోషన్ ప్లస్ పబ్లిసిటీ చాలా ముఖ్యం. అందులోనూ పింక్ చాలా మంది గతంలో చూసేసిన రీమేక్. కథ అందరికీ తెలుసు. అలాంటప్పుడు బజ్ రావాలంటే సైలెంట్ గా ఉంటే సరిపోదు. క్రమంతప్పకుండా జనం మాట్లాడుకునేలా ఏదో ఒకటి వదులుతూనే ఉండాలి. అది పాటలు కావొచ్చు లేదా ఏదైనా పోస్టర్ కావొచ్చు లేదా ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ చెప్పొచ్చు. అలాంటిదేమో లేకుండా ఇలా స్తబ్దుగా ఉండటం ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. అందుకే సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వెలిబుచ్చుతున్నారు. అయితే దిల్ రాజు టీమ్ ప్లాన్ వేరే ఉన్నట్టు కనిపిస్తోంది.
ఇంకొద్ది రోజులు ఆగి మార్చ్ నుంచి ప్రమోషన్ స్పీడ్ ని పెంచే ఆలోచనలో ఉన్నారట. అసలే కమర్షియల్ సినిమా కాకపోవడం వకీల్ సాబ్ ని కొంత ఇబ్బంది పెడుతోంది. అక్కడికి మాస్ ఆడియన్స్ కోసం చెప్పుకోదగ్గ మార్పులు చేసిన వేణు శ్రీరామ్ అసలు కథను ఎక్కువ చెడగొట్టడానికి ఉండదు కాబట్టి దానికి అనుగుణంగానే ఇందులో ఏముంటుందనే క్లూని ప్రోమోల రూపంలో ఇవ్వబోతున్నారు. మగువా మగువా పాట హిట్టయ్యాక మరో ఆడియో ట్రాక్ రాలేదు. శృతి హాసన్ తో షూట్ చేసిన డ్యూయెట్ ని వచ్చే నెల వదిలే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా వకీల్ సాబ్ కేవలం యాభై రోజులే చేతిలో ఉన్న విషయాన్ని గుర్తు పెట్టుకుని స్పీడ్ పెంచాలి