Idream media
Idream media
ఐసీసీ టోర్నీలో ఇప్పటివరకూ విజేతగా నిలవాలని జట్లలో సౌత్ ఆఫ్రికా ఒకటి.కానీ ఆ జట్టులో ఆటగాళ్ల ప్రతిభకు కొదవలేదు.కొందరు సఫారీ ఆటగాళ్ళు అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన రికార్డులు కూడా నెలకొల్పారు.ఆ కోవలోనే దక్షిణాఫ్రికాకు చెందిన జాక్వెస్ రుడాల్ఫ్ అరంగేట్ర టెస్ట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన ఐదవ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సాధించాడు.సరిగ్గా 17 ఏళ్ల క్రితం చిట్టగాంగ్‌లోని ఎంఏ అజీజ్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన తన తొట్టతొలి టెస్టులో రుడోల్ఫ్ ఈ ఘనత సాధించాడు. కాగా 2003 ఏప్రిల్ 26న అరంగేట్ర టెస్టులో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర పుటలలో తన పేరు లిఖించాడు.
మొదట బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగులకే ఆలౌట్ అయింది.ప్రోటీస్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 41 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్‌కు దిగిన రుడోల్ఫ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి అజేయంగా 15 పరుగులతో క్రీజ్ నందు నిలిచాడు.రెండో రోజు ఆటలో అద్భుత బ్యాటింగ్ నైపుణ్యం ప్రదర్శించిన రుడోల్ఫ్ 170 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఏప్రిల్ 26న మూడో రోజు లంచ్ విరామ సమయానికి కంటే ముందే ద్వి శతకం సాధించి ఆడిన మొట్టమొదటి టెస్టులోనే అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌లలో రెండోవాడిగా రికార్డు సాధించాడు.
ఎనిమిదిన్నర గంటలకు పైగా క్రీజ్ లో నిలిచిన రుడాల్ఫ్ 383 బంతులు ఆడి 222 పరుగులు చేశాడు.అతని మారథాన్ ఇన్నింగ్స్‌లో 2 సిక్సర్లు, 29 బౌండరీలను కొట్టాడు, దీంతో సఫారీ జట్టు రెండు వికెట్ల నష్టానికి 470 పరుగులు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.బంగ్లా మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టిన స్పిన్నర్ పాల్ ఆడమ్స్ ఐదు వికెట్ల తేడాతో రెండవ ఇన్నింగ్స్‌లో కూడా ఐదు వికెట్ల వికెట్లను మరోసారి తన ఖాతాలో వేసుకున్నాడు.నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్‌ను ఇన్నింగ్స్,60 పరుగుల తేడాతో ఓడించింది.
రుడాల్ఫ్ కు మంచి బ్యాటింగ్ సపోర్ట్ ఇచ్చిన మరో సఫారీ బ్యాట్స్‌మెన్ డిప్పెనార్ కూడా 369 బంతులను ఎదుర్కొని అజేయంగా 177 పరుగులు సాధించాడు.ఈ క్రమంలోనే మూడో వికెట్‌కు డిప్పెనార్‌తో కలిసి 429 రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు.టెస్ట్ క్రికెట్‌లో దక్షిణాఫ్రికాకు ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ పరుగుల భాగస్వామ్యం కావడం విశేషం.మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ టెస్ట్ మ్యాచ్‌లో నలుగురు ఆటగాళ్లు ఆరంగేట్రం చేశారు.సఫారీ జట్టు నుండి ముగ్గురు జెఎ రుడాల్ఫ్, ఎసి డాసన్,సిఎమ్ విల్లౌబీ,బంగ్లాదేశ్ నుంచి మహమ్మద్ సలీమ్ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు.