iDreamPost
iDreamPost
ఓటిటిలో వి డైరెక్ట్ గా రిలీజయ్యాక అందరి కన్ను అనుష్క నిశ్శబ్దం మీదే ఉంది. నిజానికి అన్ని సినిమాల కన్నా ముందు డిజిటల్ లో వచ్చే మూవీగా దీనికే ఎక్కువ ప్రచారం దక్కింది. కానీ ప్రొడ్యూసర్లు ఎప్పటికప్పుడు అదేం లేదన్నట్టుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్ అప్పుడప్పుడూ హింట్ ఇచ్చినప్పటికీ ఇప్పటిదాకా క్లారిటీ మాత్రం రాలేదు. తాజా అప్డేట్ ప్రకారం అక్టోబర్ లో నిశ్శబ్దం గట్టి సౌండ్ చేయబోతోంది. ప్రైమ్ తో డీల్ ఒక కొలిక్కి వచ్చిందని వచ్చే నెల 10 లేదా 17న విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోందట. మల్టీ లాంగ్వేజ్ మూవీ కాబట్టి రేట్ విషయంలో కాస్త పట్టువిడుపులు రావడంతో ఇంత ఆలస్యం జరిగిందని ఇన్ సైడ్ టాక్. భాగమతి తర్వాత స్వీటీకి చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పటికి రెండున్నర ఏళ్ళుగా అనుష్కను తెరమీద చూడలేదు. మధ్యలో సైరాలో కనిపించింది కానీ అది కేవలం కొద్దినిమిషాల పాటే కాబట్టి కౌంట్ లోకి వేసుకోలేం. అప్పటి నుంచి అభిమానులు తనను స్క్రీన్ మీద చూడాలని ఎదురు చూసే కొద్దీ ఆలస్యం అవుతూనే వచ్చింది.
ఇన్నేళ్లకు నిరీక్షణ ఫలించినట్టే కనిపిస్తోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన నిశ్శబ్దం హారర్ కం క్రైమ్ థ్రిల్లర్. గతంలో వచ్చిన టీజర్ మంచి ఆసక్తిని రేపింది. ఇందులో అనుష్క మాటలు రాని మూగ పాత్ర చేస్తోందని వినికిడి.సవ్యసాచి తర్వాత మాధవన్ చేస్తున్న స్ట్రెయిట్ తెలుగు సినిమా ఇదే. అంజలి, సుబ్బరాజు, షాలిని పాండే తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటిటి విడుదలే కరెక్ట్.
థియేటర్లు తెరుచుకుని జనం మునుపటి లాగే హౌస్ ఫుల్ చేసే సీన్ ఇప్పుడప్పుడే కనిపించడం లేదు. పైపెచ్చు రికవరీ శాతం ఎంత అద్భుతంగా ఉన్న కేసులు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి కాబట్టి పబ్లిక్ సినిమా హాళ్లకు అంతగా ప్రాధ్యానత ఇవ్వడం అనుమానమే. ఒకటిరెండు రోజులు కొత్త మోజులో వచ్చినా ఆ తర్వాత క్రౌడ్స్ ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేరు. అందుకే నిశ్శబ్దం ఇంతకన్నా లేట్ చేయడం భావ్యం కాదని భావించి అక్టోబర్ రిలీజ్ కు లాక్ అయ్యేలా కనిపిస్తోంది. ఇదైనా యూనిట్ అధికారికంగా ఏదైనా ప్రకటన రూపంలో చెబితేనే సుమా. వికి అమెజాన్ ప్రైమ్ మంచి ప్రమోషనల్ స్ట్రాటజీ వాడినట్టు దీనికి కూడా ఏదైనా ప్లానింగ్ చేస్తున్నారేమో. దీని తర్వాత అనుష్క చేయబోయే కొత్త ప్రాజెక్టులు మాత్రం ఇంకా సస్పెన్స్ లోనే కొనసాగుతున్నాయి. లెట్ వెయిట్ అండ్ సి.