iDreamPost
android-app
ios-app

బిజినెస్ డీల్స్ లో సోలో బ్రతుకు

  • Published Dec 03, 2020 | 6:17 AM Updated Updated Dec 03, 2020 | 6:17 AM
బిజినెస్ డీల్స్ లో సోలో బ్రతుకు

ఈ నెల 25వ తేదీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని థియేటర్ల యజమానులు, సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. కారణం లాక్ డౌన్ తర్వాత ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమా అది కూడా పేరున్న హీరో మూవీ నేరుగా హాళ్లలోకి రానుండటంతో అంచనాలు బాగానే ఉన్నాయి. దీని కన్నా ముందు వర్మ కరోనా వైరస్ వస్తున్నప్పటికీ దాని మీద పెద్దగా ఎవరికీ నమ్మకం కానీ ఆశలు కానీ లేవు. అందుకే హౌస్ ఫుల్ అనే బోర్డు మళ్ళీ కనిపించాలంటే సోలో బ్రతుకే సో బెటరూ కన్నా బెటర్ ఆప్షన్ ఇంకేదీ కనిపించడం లేదు. సుమంత్ కపటధారి కూడా వస్తోంది కానీ మార్కెట్ పరంగా చూసుకుంటే దాని మీద పెద్దగా హైప్ లేదు. టాక్ మీదే ఆధారపడాలి.

సాయి తేజ్ సినిమాని థియేట్రికల్ తో సహా మొత్తం హక్కులు కొన్న జీ సంస్థ దాన్ని స్వంతంగా విడుదల చేసే వ్యవస్థ లేకపోవడంతో పాటు అనుభవలేమి వల్ల దాని హక్కులను ఏరియాల వారీగా అమ్మేసే ప్లాన్ లో ఉన్నట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే ఒకటి రెండు ప్రాంతాలకు డీల్ కూడా పూర్తయ్యిందని ఇన్ సైడ్ న్యూస్. కాకపోతే సాధారణ పరిస్థితుల్లో వచ్చే రేట్ కంటే ముప్పై నలభై శాతం తక్కువగా వస్తోందట. ఉదాహరణకు పన్నెండు కోట్ల దాకా పలికే నైజామ్, ఆంధ్ర రైట్స్ ఇప్పుడు ఎనిమిది కోట్ల దగ్గరే ఆగిపోయింది. యువి వంశీ దాదాపుగా ఈ మార్క్ ని క్లోజ్ చేసినట్టుగా వినికిడి.

మిగిలిన వాటికి కూడా దిల్ రాజులాంటి బడా డిస్ట్రిబ్యూటర్లు రీజనబుల్ గానే ధరలు అడుగుతున్నారని తెలుస్తోంది. సో బ్రతుకే సో బెటరూ హక్కులను భారీ ధర చెల్లింది కొనుకున్న జీ సంస్థ ఇప్పుడు నిర్మాత పడాల్సిన తిప్పలన్నీ తను పడుతోంది. మొత్తం గంపగుత్తగా అమ్మేసిన నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ మాత్రం హ్యాపీగా రిలాక్స్ అవుతున్నారు. 50 శాతం ఆక్యుపెన్సీతో మెగా హీరో జనాన్ని ఎన్ని రోజులు రప్పించగలడన్నది ఆసక్తికరంగా ఉండబోతోంది. సుబ్బు దర్శత్వంలో రూపొందిన ఈ సినిమాలో నభ నటేష్ హీరోయిన్ కాగా తమన్ అందించిన సంగీతానికి ఇప్పటికే మంచి రెస్పాన్స్ దక్కింది.