iDreamPost
android-app
ios-app

సోలో బ్రతుకుదే మొదటి బోణీ

  • Published Nov 16, 2020 | 9:19 AM Updated Updated Nov 16, 2020 | 9:19 AM
సోలో బ్రతుకుదే మొదటి బోణీ

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఇంకా తెరుచుకోని పరిస్థితుల్లో సినిమా ప్రేమికుల ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి. తమిళనాడులో దీపావళి పండగ సందర్భంగా సగం కెపాసిటీతోనే బిస్కోత్ లాంటి కొత్త మూవీస్ ని రిలీజ్ చేసి ప్రేక్షకులను రప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు. నిన్న చెన్నై, కోయంబత్తుర్, వేలూరు నగరాల్లో అధిక శాతం ఆన్ లైన్ బుకింగ్స్ హౌస్ ఫుల్స్ చూపించడం దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఇంకొద్ది రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. డిసెంబర్ మొదటి వారం నుంచి తెరిచేందుకు ఎగ్జిబిటర్లు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ లో 50 శాతం ఆక్యుపెన్సీతో అనుమతులు ఇచ్చినప్పటికీ డిస్ట్రిబ్యూటర్లు ఇంకా వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు. తీస్తే రెండు రాష్ట్రాల్లో ఒకేసారి జరగాలన్నది వాళ్ళ ఆకాంక్ష. అయితే ముందుగా రావాలని నిర్ణయించుకున్నది మాత్రం సోలో బ్రతుకే సో బెటరూనే. ఇటీవలే ఇచ్చిన ప్రకటనలో దాన్ని చెప్పేసినప్పటికీ మాట మీద ఉండగలరా అనే అనుమానం అభిమానుల్లో వ్యక్తమయింది. థియేట్రికల్ తో సహా డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న జీ సంస్థ మొదటిసారి దీని ద్వారా పంపిణి రంగంలోకి దిగబోతోంది. లాభమో నష్టమో వచ్చే నెలకే ఫిక్స్ అవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.

ప్రతి రోజు పండగే లాంటి హిట్ మూవీ తర్వాత చేసిన సినిమా కావడంతో సుప్రీమ్ హీరో సాయి తేజ్ కి దీని మీద చాలా నమ్మకం ఉంది. సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మూవీలో నభా నటేష్ హీరోయిన్. విడుదలైన ఆడియో ట్రాక్స్ కి రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఇమేజ్ ఉన్న హీరో సినిమా కాబట్టి డిసెంబర్ లో పోటీ లేకుండా వస్తే అధిక శాతం థియేటర్లలో వేసుకునే అవకాశం ఉంటుంది. దాని వల్ల విడివిడి స్క్రీన్లకు రెవిన్యూ తగ్గినట్టు అనిపించినా ఒక్కో సెంటర్లో కలుపుకుని చూస్తే మంచి కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఎలాగూ ఏదైనా తేడా వస్తే జీ వెంటనే దీన్ని ఓటిటిలో రిలీజ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. సో రిస్క్ లేనట్టే.