iDreamPost
android-app
ios-app

పదవుల సంగతి పక్కనపెట్టండి.. కనీసం ఈ కులాల పేర్లు విన్నారా?

  • Published Mar 19, 2021 | 12:07 PM Updated Updated Mar 19, 2021 | 12:07 PM
పదవుల సంగతి పక్కనపెట్టండి.. కనీసం ఈ కులాల పేర్లు విన్నారా?

తనపై అపారమైన అభిమానంతో అధికారం అప్పగించిన ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి.. వారికి సామాజిక న్యాయం చేయడంలోనూ తనకు సాటి లేరని నిరూపించారు. దీనికి తాజా నిదర్శనం నిన్నటి మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవులకు అభ్యర్థుల ఎంపిక.

ఎన్నిక జరిగిన 11 నగర పాలక సంస్థలు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ల్లో.. నిర్ణీత రిజర్వేషన్లకు మించి 78 శాతం అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించిన వైస్సార్సీపీ.. వాటిలోనూ అనాదిగా అణగారిన కులాల వారికి పదవులిచ్చి.. ఆ సామాజికవర్గాల్లో వెలుగు నింపింది.

ఆ నాలుగు వర్గాల్లో వెలుగు

రాజకీయ పదవుల పంపకం, నియామకాలు, ఎన్నికల్లో సీట్ల కేటాయింపుల్లో సమాజికవర్గ సమీకరణలు చూసుకోవడం, సమతుల్యత పాటించడం కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న తంతే. పార్లమెంట్, అసెంబ్లీ, ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, లకు జనాభా నిష్పత్తి ప్రకారం రాజ్యాంగమే సీట్లు రిజర్వ్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కూడా రిజర్వేషన్ లు ఉన్నాయి. ఆ ప్రకారమే పార్టీలు ఆయా వర్గాలకు సీట్లు కేటాయిస్తూ వస్తున్నాయి.

Also Read:బెజవాడ పీఠంపై భాగ్యలక్ష్మి

అయితే రిజర్వేషన్లు వర్తించే ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల జాబితాల్లో చేరిన అన్ని కులాలకు రాజకీయాధికారం లభించడం లేదన్నది చేదు నిజం. ఆయా వర్గాల్లో ప్రాబల్యం ఉన్న కులాలకు ఇన్నాళ్లు సీట్లు కేటాయించడం పార్టీలకు పరిపాటిగా మారింది. అయితే వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ.. ఇంతకాలం రాజకీయ ప్రాతినిధ్యానికి నోచుకోని వర్గాలను గుర్తించు వెలుగులోకి తీసుకొస్తోంది.

గత నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ, ఈ నెలలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ నిబంధనలకు మించి నిమ్న వర్గాలకు అవకాశం ఇచ్చిన పార్టీ.. తాజాగా జరిగిన మున్సిపల్ అధ్యక్షుల ఎన్నికల్లో అణగారిన కులాల వారిని అభ్యర్థులుగా ఎంపిక చేసి గెలిపించుకోవడం విశేషం. ప్రధానంగా రెల్లి, రెడ్డిక, వడ్డెర, యానాది కులాలకు అవకాశం కల్పించడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.

రెల్లీలకు తొలి అవకాశం

ఈ ఎన్నికల్లో విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఎస్సీ జాబితాలోని రెల్లి వర్గానికి అవకాశం కల్పించారు. మన రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలతోపాటు ఓడిశాలోని రాయగడ, కోరాపుట్ ప్రాంతాల్లో నివసించే ఈ వర్గం వారు పళ్ళు, ఫూలు అమ్ముకొని జీవిస్తుంటారు. రాష్ట్రంలో సుమారు లక్షన్నర జనాభా ఉన్న ఈ వర్గానికి ఇంతకు ముందెన్నడూ రాజకీయ పదవులు లభించిన దాఖలాల్లేవు. ఇప్పుడు తొలిసారిగా రెల్లి వర్గానికి చెందిన బంగారు సరోజినిని వైఎస్సార్సీపీ చైర్మన్ గా గెలిపించుకుంది.

Also Read:మామ అటెండర్ గా చేసిన కార్పొరేషన్ కు కోడలు మేయర్

రెడ్డికలకు ప్రోత్సాహం

మన రాష్ట్రంలోని శ్రీకాకుళం, ఓడిశాలోని గంజాం జిల్లాల్లో ప్రధానంగా నివసించే బీసీ వర్గ మైన రెడ్డిక సామాజికవర్గానికి జగన్ తొలి నుంచి ప్రాధాన్యమిస్తున్నారు. గతంలో ఈ సామాజికవర్గానికి చెందిన దక్కత అచ్యుతారామిరెడ్డి మాత్రమే కాంగ్రెస్ హయాంలో ఇచ్చాపురం ఎమ్మెల్యేగా చేశారు. గత ఎన్నికల్లో విశాఖ జిల్లా గాజువాకలో ఇదే వర్గానికి చెందిన తిప్పల నాగిరెడ్డిని ఎమ్మెల్యే చేసిన జగన్.. మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చాపురంలో పిలక రాజ్యాలక్ష్మికి చైర్ పర్సన్ అయ్యే అవకాశం కల్పించారు. వైఎస్సారసీపీ ఆధ్వర్యంలోని గత పాలకవర్గానికీ ఈమె అధ్యక్షురాలిగా ఉన్నారు.

వడ్డెరలకు మూడు

రాష్ట్రంలో మరో నిమ్న వర్గం వడ్డెర్లు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగా నివసించే వీరి ప్రధాన వృత్తి రాళ్లు కొట్టడం.మట్టి పని చేయటం. బాగా వెనుకబడిన ఈ వర్గానికి చెందిన వారికి ఏకంగా మూడు మున్సిపాలిటీలో జగన్ అవకాశం కల్పించారు. బీసీ కేటగిరీలో ప్రకాశం జిల్లా చీమకుర్తి చైర్మన్ గా చల్లా అంకులు, గుంటూరు జిల్లా మాచర్లలో తురక కిశోర్, కడప జిల్లా పులివెందులలో వల్లెపు వరప్రసాద్ వైఎస్సారసీపీ ఇచ్చిన అవకాశంతో మున్సిపల్ చైర్మన్లు అయ్యారు.

Also Read:జగన్ సోషల్ ఇంజినీరింగ్ తెచ్చిన విజయం

ఇదే వర్గానికి చెందిన చంద్రగిరి ఏసురత్నానికి సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజవర్గ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయినా.. ఎంతోమంది పోటీపడిన వారిని కాదని గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ గా అందలమెక్కించడం విశేషం.

యానాదులకు అవకాశం

మరో బడుగు సామాజికవర్గమైన యానాది వర్గానికి వైఎస్సారసీపీ అవకాశం కల్పించింది. సంచార జాతైనా యానాది వర్గం బాగా వెనుకబడినది. బాతుల పెంపకం,పొలం కాపలా,వేట చేస్తూ జీవించే యానాదులు నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగా నివసిస్తుంటారు.నెల్లూరులో యాదుల కోసం ఐటిడిఏ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎస్టీ కేటగిరీలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ గా ఈ వర్గానికి చెందిన గోపారం వెంకటరమణమ్మకు అవకాశం కల్పించారు.

నగరాలకు అవకాశం
విజయవాడలో సంఖ్యాపరంగా భారిగా ఉన్న “నగరాల”కు ప్రాధాన్యత లేకుండా పోయింది. జగన్ విజయవాడ మేయర్ గా “నగరాలు” సామాజిక వర్గానికి చెందిన భాగ్యలక్ష్మికి అవకాశం ఇచ్చారు.టీడీపీ ఆవిర్భావానికి ముందే తమ్మిన పోతు రాజు కమ్యూనిస్ట్ పార్టీ తరుపున ఎమ్మెల్యే అయ్యారు,మళ్ళీ ఇంతకాలానికి నగరాలకు అవకాశం వచ్చింది.

Also Read:బీసీలు, మహిళలతో కోట కట్టుతున్న జగన్

ఇదే కాదు జగన్ మోపిదేవి వెంకట్ రమణను రాజ్యసభకు పంపేవరకు మత్సకార వర్గం నుంచి ఎవరు రాజ్యసభకు ఎన్నిక కాలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. శెట్టి బలిజ కులం నుంచి కూడా ఇదే పరిస్థితి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆ కులం నుంచి రాజ్యసభకు ఎన్నికయిన తొలి నేత . ..

రిజర్వేషన్లలో కూడా  ఒకటి రెండు కులాలే అధిక శాతం పదవులు పొందాయి. మరీముఖ్యంగా ఆ కులాల్లో కూడా రెండు మూడు కుటుంబాలే దశాబ్దాలుగా పదవులు అనుభవించారు.

సోషల్ ఇంజనీరింగ్ కు సరైన అర్ధం చెప్పిన జగన్
కులం చూడం,మతం చూడం,ప్రాంతం చూడం అని ఎప్పుడూ చెప్పే జగన్ మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో నేతల కుల బలం,ఆర్ధిక పరిస్థితి , రాజకీయ బలం వంటి అంశాలను ముఖ్యంగా వారి వలన పార్టీకి ఎంత ఉపయోగమన్న కోణంలో కాకుండా ఇప్పటి వరకు తక్కువ అవకాశాలు లేక అసలు ప్రాతినిధ్యమే దక్కని కులాలకు చెందిన వారికి మేయర్, చైర్మన్ లాంటి పదవులు ఇవ్వటం సామాజిక సాధికారతకు బీజం వేస్తుంది.

రాజకీయాల్లో తరచుగా వినిపించే సోషల్ ఇంజినీరింగ్ అంటే గెలిచే కులాలకు పదవులు ఇవ్వటం కాదు.. ప్రాతినిధ్యం దక్కని ఇలాంటి కులాలకు అవకాశం ఇవ్వటం .. జగన్ చేసిన సోషల్ ఇంజనీరింగ్ ప్రభావం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ చూస్తుంది.