యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే చదువులు, శిక్షణ కోసం రాష్ట్రంలో తొలిసారిగా నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్‌మెంట్) విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది.స్కిల్ డెవలప్‌మెంట్‌పై ముఖ్యమంత్రి శుక్రవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖలు చేపడుతున్న నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన కార్యక్రమాలపై సంబంధిత అధికారులు ఈ సందర్భంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ యూనివర్సిటీ కింద ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి కోసం ఒక కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. చదువులు ముగించుకొని విద్యా సంస్థల నుంచి బయటకు వస్తున్న ప్రతి విద్యార్థి ఉద్యోగం లేదా ఉపాధి పొందడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.