iDreamPost
android-app
ios-app

శిరిడీ ఆలయం మూసివేతపై ట్రస్ట్‌ కీలక నిర్ణయం

శిరిడీ ఆలయం మూసివేతపై ట్రస్ట్‌ కీలక నిర్ణయం

సాయిబాబు జన్మభూమి పై నెలకొన్న వివాదం నేపథ్యంలో ఆదివారం నుంచి శిరిడీ ఆలయం మూసివేస్తున్నారంటూ వస్తున్న వర్తాలు, జరుగుతున్న ప్రచారంపై సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ ఈ రోజు కీలక ప్రకటన చేసింది. శిరిడీ బంద్‌ చుట్టు పక్కల గ్రామాల వరకే పరిమతమని, బంద్‌తో ఆలయానికి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది.

గ్రామస్తులు ఇచ్చిన బంద్‌ పిలుపుపై వారితో తాము చర్చించబోమని పేర్కొంది. ఆలయంలో భక్తుల దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు చేపడతామని పేర్కొంది.

సాయిబాబా జన్మస్థలంగా చెబుతున్న పాథ్రీ పట్టణ అభివృద్ధికి మహారాష్ట్రలోని ఉద్ధవ్‌ఠాక్రే ప్రభుత్వం 100 కోట్లు కేటాయించిన నేపథ్యంలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. శిరిడినే సాయిబాబా జన్మస్థలమని కొందరు, కాదు పాథ్రీనే అని మరికొందరు వాదిస్తున్నారు. సాయిబాబు జన్మస్థలంగా పాథ్రీ పట్టణానికి ప్రాముఖ్యత ఇస్తే.. శిరిడి ప్రాశస్త్యం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, మహారాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోండగా ఈ వివాదం ఏ దిశగా పయనిస్తుందో చూడాలి.