iDreamPost
android-app
ios-app

Salaar : ఆధ్య గా వస్తున్న బ్యూటిఫుల్ శృతి హాసన్!

  • Published Jan 28, 2022 | 10:51 AM Updated Updated Jan 28, 2022 | 10:51 AM
Salaar : ఆధ్య గా వస్తున్న బ్యూటిఫుల్ శృతి హాసన్!

సంచలనం సృష్టించిన ‘కెజిఎఫ్’ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో హీరో ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సాలార్.’ ఈ చిత్రంలో మేకర్స్ కథానాయిక పోస్టర్‌ను ఆవిష్కరించారు మరియు ఈరోజు తన పుట్టిన రోజు కూడా. తాను మరెవరో కాదు బ్యూటిఫుల్ & టాలెంటెడ్ హీరోయిన్ శృతి హాసన్.

నటుడు ప్రభాస్ కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో శృతికి ప్రత్యేకమైన పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ప్రభాస్ తన సోషల్ మీడియా లో ఇలా రాశారు. “నా వినోదభరితమైన హీరోయిన్, సెట్స్‌లోని ఎనర్జీ బాల్ శృతి హాసన్ పుట్టినరోజు శుభాకాంక్షలు! #సాలార్”.

సాలార్ సినిమాలో ఆద్యగా శృతి నటిస్తోంది. ఇప్పుడే విడుదలైన పోస్టర్‌లో ఆలోచనల్లో కూరుకుపోయిన లాంగ్ స్లీవ్ టాప్ ధరించి కనిపించింది. ఈ చిత్రంలో ఆమె పొలిటికల్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తుందని అంతర్గత సమాచారం, అయితే దీని గురించి మేకర్స్ ఇంకా ఎలాంటి అధికార ప్రకటన వెల్లడించలేదు.

విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ‘సాలార్’ సినిమా యాక్షన్ థ్రిల్లర్ మరియు కన్నడ మరియు తెలుగు భాషలలో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా హిందీ, తమిళం, మలయాళం భాషల్లోనూ “సాలార్” విడుదలవుతోంది.

రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ‘KGF-చాప్టర్ – 2తో సమానంగా ఇది 2022 ఏప్రిల్ 14న విడుదల కానుంది.

Also Read :Ram Charan : చరణ్ కైనా ఇది మళ్ళీ సాధ్యం కాదు