iDreamPost
android-app
ios-app

శర్వానంద్ మార్పుకు ‘శ్రీకారం’

  • Published Jan 27, 2020 | 8:09 AM Updated Updated Jan 27, 2020 | 8:09 AM
శర్వానంద్ మార్పుకు ‘శ్రీకారం’

డిఫరెంట్ సబ్జెక్టులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడనే పేరున్న శర్వానంద్ ఈ మధ్య కాస్త స్పీడ్ తగ్గించాడు. చాలా టైం తీసుకుని చేసిన రణరంగం ఫెయిల్ కావడం కొంత ఎఫెక్ట్ చూపించినప్పటికీ బ్యాక్ టు బ్యాక్ విభిన్నమైన కథాంశాలతో 2020లో రెండు మూడు సినిమాలు వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. మొదటిది తమిళ 96 రీమేక్ జాను వచ్చే నెల 7 రానుండగా మరో మూవీ సమ్మర్ గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాడు.

డెబ్యూ డైరెక్టర్ కిషోర్ బి దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ రూపొందిస్తున్న సినిమాకు “శ్రీకారం” అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇవాళ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందులో పంచె కట్టుకుని పొలం గట్టు మీద నడుస్తున్న శర్వా గెటప్ చాలా కొత్తగా ఉంది. గ్రామాలకు సంబంధించిన ఒక కాన్ టెంపరరి ఇష్యూ మీద ఇది రూపొందుతున్నట్టుగా తెలిసింది.ముందు సంక్రాంతికే రిలీజ్ ని ప్లాన్ చేసుకున్నారు కానీ షూటింగ్ బాలన్స్ ఉండిపోవడంతో ఆ ఆలోచన మానుకున్నారు

గతంలో శ్రీకారం టైటిల్ తో జగపతి బాబు హీరోగా ఒక సినిమా వచ్చింది. రేప్ విక్టిమ్ అనే సున్నితమైన అంశంతో రూపొందిన ఆ మూవీ విజయం సాధించలేదు. ఇప్పుడు శ్రీకారం కూడా సోషల్ ఇష్యూ మీదే వస్తోంది కానీ రైతుల సమస్య మీద తీస్తున్నారని ఇన్ సైడ్ టాక్. శర్వాతో గతంలో శతమానం భవతి లాంటి మ్యూజికల్ హిట్ ఇచ్చిన మిక్కీ జె మేయర్ దీనికి సంగీతం అందిస్తుండగా రైటర్ గా టాప్ ఫామ్ లో ఉన్న సాయి మాధవ్ బుర్ర సంభాషణలు సమకూరుస్తున్నారు. గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. వేసవి విడుదలకు ప్లాన్ చేసిన శ్రీకారం మీద ఈ పోస్టర్ తో అంచనాలు పెరిగాయనే చెప్పాలి.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın almadridbetmadridbetmadridbetkatlaMarsbahis GirişCasibom GirişJojobet GirişCasibomMarsbahis Giriş