iDreamPost
android-app
ios-app

యూఎస్‌ ఓపెన్‌ – సెరెనా పోరాటం ముగిసింది

యూఎస్‌ ఓపెన్‌ – సెరెనా పోరాటం ముగిసింది

24వ సింగిల్స్‌ గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ సొంతం చేసుకునే దిశగా అడుగులు వేసిన టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ పోరాటం సెమీ ఫైనల్లో ముగిసింది. గురువారం రాత్రి జరిగిన సెమీ ఫైనల్స్‌లో బెలారస్‌కు చెందిన మాజీ నంబర్‌ వన్‌ క్రీడాకారిణి విక్టోరియా అజెరెంక 1-6, 6-3, 6-3 తేడాతో సెరెనాపై గెలుపొందింది.

24 వ గ్రాండ్ స్లామ్ లక్ష్యంగా బరిలోకి దిగిన సెరెనాకు మొదటి సెట్లో తిరుగులేకుండా పోయింది. సెట్ ఆధ్యంతం ఆధిపత్యం చెలాయించిన సెరెనా 1-6 తో ఆ సెట్ ను సొంతం చేసుకుంది. కానీ ఆట మధ్యలో సెరెనా కాలికి గాయం కావడం విక్టోరియా అజెరెంకకు కలిసొచ్చింది. సెరెనా గాయం తర్వాత వేగంగా కదల లేకపోవడంతో విక్టోరియా అజెరెంక సునాయాసంగా మిగిలిన రెండు సెట్లను 6-3, 6-3 తేడాతో సెరెనాపై విజయం సాధించింది. ఫైనల్లో అజెరెంక జపాన్‌ అగ్రశ్రేణి క్రీడాకారిణి నవోమీ ఒసాకాతో తలపడనుంది.