iDreamPost
android-app
ios-app

గోపీచంద్ రావడం లేదా

  • Published Mar 27, 2021 | 5:31 AM Updated Updated Mar 27, 2021 | 5:31 AM
గోపీచంద్ రావడం లేదా

నిన్న ఈ రోజుతో కలిపి మొత్తం నాలుగు తెలుగు సినిమాలు సందడి చేయడం అయిపోయింది. విన్నర్ ఎవరో ఖచ్చితంగా చెప్పలేం కానీ నితిన్ రంగ్ దే పైచేయి సాధించిన మాట వాస్తవం. అరణ్యకు ప్రశంసలు ఉన్నా వసూళ్లు ఘనంగా లేవు. కొణిదెల ఫ్యామిలీ అంటూ చెప్పుకుని ప్రమోట్ చేసుకున్న ఈ కథలో పాత్రలు కల్పితంను పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇక తెల్లవారితే గురువారం రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. వీటి సంగతి పక్కన పెడితే ఇప్పుడు అందరి చూపు ఏప్రిల్ 2 మీద వెళ్తోంది. మంచి క్రేజీ మాస్ సినిమాలు ఆ రోజు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాయి. ట్రైలర్లు ఆల్రెడీ వచ్చేశాయి కూడా.

ముందు ఓటిటి అనుకుని తర్వాత థియేటర్ కు ఫిక్స్ అయిన నాగార్జున వైల్డ్ డాగ్ మీద మంచి అంచనాలే ఉన్నాయి. మొదట దీని గురించి ఎవరికీ పెద్దగా అవగాహన లేకపోయినప్పటికీ ట్రైలర్ చూశాక ఒక్కసారిగా హైప్ వచ్చేసింది. బాలీవుడ్ స్టాండర్డ్ ని తలదన్నేలా రూపొందిన ఈ యాక్షన్ థిల్లర్ లో నాగ్ ఎన్ఐఏ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఇక కార్తీ సుల్తాన్ కూడా మాస్ కు ఛాయస్ గా నిలుస్తోంది. హీరోయిన్ రష్మిక మందన్న, కమర్షియల్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. ఎటు తిరిగి అదే డేట్ ని లాక్ చేసుకున్న గోపీచంద్ సీటిమార్ మాత్రం సైలెంట్ అవ్వడం ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటిదాకా రిలీజ్ చేసిన పాటలు ట్రైలర్లకు రెస్పాన్స్ బాగుంది. చాలా ఏళ్లుగా సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న గోపీచంద్ కు ఇది హిట్ అందిస్తుందన్న నమ్మకంతో అభిమానులు ఉన్నారు. తమన్నా గ్లామర్, మణిశర్మ సంగీతం, దర్శకుడు సంపత్ నంది ఎంచుకున్న నేపథ్యం ఆసక్తి రేపుతున్నాయి. మరి పబ్లిసిటీ విషయంలో ఎందుకు కామ్ గా ఉన్నారో అర్థం కావడం లేదు. వాయిదా తప్పకపోవచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. యూనిట్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతానికి ఏప్రిల్ 2 కన్ఫర్మ్ అనే అనుకోవాలి. ఒకవేళ ఏదైనా మార్పు జరిగితే మాత్రం అదే నెల చివరి వారానికి వెళ్లే అవకాశాలు లేకపోలేదు