iDreamPost
android-app
ios-app

మరోసారి ఆందోళనలో సినీ పరిశ్రమ

  • Published Apr 07, 2021 | 7:41 AM Updated Updated Apr 07, 2021 | 7:41 AM
మరోసారి ఆందోళనలో సినీ పరిశ్రమ

అంతా సర్దుకుంది, జనం ఎప్పటిలాగే థియేటర్లకు వస్తున్నారు, సినిమా బాగుంటే కోట్ల రూపాయలు కలెక్షన్లు కురుస్తున్నాయన్న ఆనందం పట్టుమని నాలుగు నెలలు కూడా కాలేదు. అప్పుడే మరోసారి ప్రమాద సంకేతాలు మొదలయ్యాయి. తెలంగాణలో కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యల గురించి వివరించమని హై కోర్టు 48 గంటల గడువు ఇచ్చిన నేపథ్యంలో రాబోయే పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఇంకో రెండు రోజుల్లో సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో రిపోర్ట్ తయారు చేసేందుకు అధికారులు సిద్ధపడుతున్నారు. ఆలోగా ఒక ఉన్నత స్థాయి సమావేశంతో పాటు మీడియాతో ముఖ్యమంత్రి కార్యక్రమం జరిగే అవకాశం ఉంది.

ఒకవేళ తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తరహాలో తెలుగు రాష్ట్రాలు కూడా 50 శాతం ఆక్యుపెన్సీ అంటే సినిమా హాళ్లకు మళ్ళీ గడ్డుకాలం వచ్చినట్టే. పెద్ద సినిమాల వాయిదా గురించి ఇప్పటికే నానా ప్రచారాలు జరుగుతున్నాయి. లవ్ స్టోరీ, ఆచార్య, టక్ జగదీశ్ టీమ్ లు ఉన్నట్టుండి సైలెంట్ అవ్వడం అనుమానాలు పెంచుతోంది. ఒకవేళ ఏవైనా నిబంధనలు వస్తే ఏప్రిల్ 15 నుంచి అమలు చేసేలా ఒక ప్రతిపాదన అయితే సిద్ధం చేశారట. అదే నిజమైతే వకీల్ సాబ్ కు ఓ వారం రోజులు టైం దొరుకుతుంది. సాధ్యమైనంత రాబట్టుకుని బ్రేక్ ఈవెన్ చేరుకుంటే డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు సేఫ్ అవుతారు.

ఇది జరిగితే మాత్రం మరోసారి సంక్షోభాన్ని ఎదురుకోవాల్సి ఉంటుంది. షూటింగులకు ఇబ్బందులు ఉండకపోవచ్చు కానీ ఇప్పటికే కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి వడ్డీలు కట్టుకుంటూ రిలీజుల కోసం ఎదురు చూస్తున్న నిర్మాతలు మాత్రం నరకం చూడక తప్పదు, బడ్జెట్ మూవీస్ కి ఎలాగూ హాఫ్ కెపాసిటీ థియేటర్లు, ఓటిటి ఆప్షన్లు ఉంటాయి కానీ స్టార్ హీరోల చిత్రాలతో ఆ డేంజర్ గేమ్ ఆడలేరు. ఒకవేళ పోస్టు పోన్లు తప్పవు అనుకుంటే ఇప్పటికే అక్టోబర్ దాకా వేసుకున్న విడుదల క్యాలెండర్ మొత్తం తలకిందులు అయిపోతుంది. కరోనా సెకండ్ వేవ్ చాప కింద నీరులా పారుతున్న తరుణంలో దేవుడి మీద భారం వేయడం తప్ప ఏమి చేయలేమని ఓ అగ్ర నిర్మాత కామెంట్